Tirumala: టీటీడీకి వినియోగదారుల కోర్ట్ షాక్.. 17 ఏళ్లుగా శ్రీవారి సేవకు భక్తుడు ఎదురుచూపులు.. రూ.45లక్షల పరిహారం ఇవ్వమని ఆదేశం
తమిళనాడులోని సేలం జిల్లా కు చెందిన హరి భాస్కర్ అనే శ్రీవారి భక్తుడు 2006లో స్వామివారికి 'మేల్ చాట్ వస్త్రం' సేవలో పాల్గొనాలని భావించాడు. ఈ మేరకు తనతో పాటు మరో ఇద్దరి పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంకు సేలం వినియోగదారుల కోర్టు షాక్ ఇచ్చింది. శ్రీవారి భక్తుడికి దర్శనం విషయంలో జరిగిన సలసత్వంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి వ్యతిరేకంగా వినియోగదారుల కోర్టు లో దాఖలైన కేసులో తుది తీర్పుని ఇచ్చింది. భక్తుడికి దర్శనం కల్పించడంతో టీటీడీ విఫలం అంటూ టీటీడీ తీరుని తప్పుపట్టిన కోర్టు.. భక్తుడికి రూ.45 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని సేలం జిల్లా కు చెందిన హరి భాస్కర్ అనే శ్రీవారి భక్తుడు 2006లో స్వామివారికి ‘మేల్ చాట్ వస్త్రం’ సేవలో పాల్గొనాలని భావించాడు. ఈ మేరకు తనతో పాటు మరో ఇద్దరి పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇందుకు గాను రూ.12,250 చెల్లించారు. నేటి వరకూ ఆయనకు ఆ సేవలో పాల్గొనే అవకాశం లభించలేదు. అయితే మేల్ చాట్ వస్త్ర సేవకు బదులుగా హరి భాస్కర్ కు బ్రేక్ దర్శనం చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు సూచించారు. కానీ తాను బుక్ చేసిన సేవనే కావాలని డిమాండ్ చేశారు. అయితే శ్రీవారి భక్తుడి కోర్కెను టీటీడీ నిరాకరించింది. టీటీడీ పట్టించుకోకపోవడంతో హరి సేలంలోని వినియోగదారుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. భాస్కర్‌కు ఏడాది లోపు ఆయన కోరిన సేవ లేదా దర్శనం కల్పించాలని.. లేదంటే రూ.45 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. భక్తుడు సేవ కోసం చెల్లించిన రూ.12,250ను రెండు నెలల్లో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. సేలం వినియోగదారుల కోర్టు ఈ కేసును విచారించి.. గత నెల 18న తీర్పు వెల్లడించగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..