Success Mantra: మీకు తరచుగా కోపం వస్తుందా.. అగ్గిపుల్లలా అది కలిగించే హాని ఏమిటో మీకు తెలుసా..!
కోపం అగ్గిపుల్ల లాంటిది. కోపం తనని తాను కాల్చడమే కాదు.. ఇతరులను కూడా కలుస్తుంది. కోపం గురించి చెప్పాలంటే.. మనిషి అతి పెద్ద శత్రువుగా వర్ణించబడింది.
Success Mantra: కోపం తెచ్చుకోవడం జీవితంలో సహజమైన ప్రక్రియ. మనందరికీ ఏదో ఒక సమయంలో కోపం వస్తుంది. కోపం వచ్చిన సందర్భంలో ఆ కోపాన్ని మన కుటుంబ సభ్యులు, స్నేహితులు కొన్ని సార్లు చూపిస్తాం.. మరికొన్ని సార్లు ఇతరులపై కూడా కోపం చూపిస్తాం. అయితే మనం తరచుగా ఇతరులకు మంచి చెడ్డలు చెప్పే సమయంలో అగ్గ్నిపుల్ల కోపం సమానం అని చెప్పవచ్చు. ఉదాహరణకు కోపం అగ్గిపుల్ల లాంటిది. కోపం తనని తాను కాల్చడమే కాదు.. ఇతరులను కూడా కలుస్తుంది. కోపం గురించి చెప్పాలంటే.. మనిషి అతి పెద్ద శత్రువుగా వర్ణించబడింది. కోపం మనిషికి ఎంతటి హానిని కలుగజేస్తుందో వివరంగా తెలుసుకుందాం .
- కోపం అంటే.. బొగ్గుని పట్టుకోవడం లాంటిదని చెప్పవచ్చు. బొగ్గుని వేరొకరిపై విసిరే ఉద్దేశ్యంతో వేడి బొగ్గును పట్టుకోవడం వలన ఎటువంటి ఫలితం ఏర్పడుతుంటే.. అటువంటిదే మనిషి కోపం.. ముందుగా ఆ వ్యక్తిని కాల్చేస్తుంది. అనంతరం అవతిలివారి మీద పడుతుంది.
- మరిగే నీటిలో నీ ప్రతిబింబాన్ని ఎలా చూడలేమో అలాగే కోపంగా ఉన్నప్పుడు కూడా నిజం కనిపించదు .
- కోపంతో మాట్లాడే ఒక్క కఠోరమైన మాట ఎంత విషంగా మారుతుందంటే అది ఒక నిమిషంలో మీరు గతంలో చెప్పిన మంచి విషయాలు.. లేదా చేసిన మంచి పనులను కూడా గుర్తు చెయ్యనంత ప్రభావం చూపుతుంది.
- అధిక కోపం మూర్ఖత్వానికి దారి తీస్తుంది. మూర్ఖత్వం జ్ఞాపకశక్తిని నాశనం చేస్తుంది, జ్ఞాపకశక్తి నశించినప్పుడు బుద్ధి నశిస్తుంది .. బుద్ధి నశించినప్పుడు జీవి నశిస్తుంది.
- కోపం నిప్పులాంటిది.. అది అన్నింటినీ కాల్చివేస్తుంది .
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..