Vinayaka Chavithi: జమ్మూ కాశ్మీర్ లో వినాయక చవితి వేడుకలు.. 8 మండపాల ఏర్పాటు పై నిర్ణయం.. ఎప్పటి నుంచి అంటే..

వినాయక చవితి రోజున మండపం ఏర్పాటు చేసి పూజ చేసే సంప్రదాయం దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో కూడా అలాంటి చైతన్యాన్ని పెంపొందించడమే ఈ గణేష్ మండపాల ఉద్దేశమని పేర్కొన్నారు.

Vinayaka Chavithi: జమ్మూ కాశ్మీర్ లో వినాయక చవితి వేడుకలు.. 8 మండపాల ఏర్పాటు పై నిర్ణయం.. ఎప్పటి నుంచి అంటే..
Jammu And Kashmir Ganesh Pu
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Aug 29, 2022 | 6:19 PM

Vinayaka Chavithi: పూణేలోని ఎనిమిది పబ్లిక్ గణేష్ పూజ కమిటీలు భారీ ప్రకటన చేశాయి. ఈ ఎనిమిది పూజా కమిటీలు కలిసి జమ్మూ కాశ్మీర్‌లోని ఎనిమిది వేర్వేరు ప్రదేశాల్లో గణేశ విగ్రహాలను ప్రతిష్టించాలని, బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేసి.. వినాయకుడికి పూజను నిర్వహించాలని నిర్ణయించాయి. ఇలా చేయడం ద్వారా జాతీయ-సాంస్కృతిక స్పృహను మేల్కొల్పడానికి.  దేశభక్తిని పెంచడానికి లోకమాన్య తిలక్ గణేష్ పూజను ప్రారంభించారని దానిని కొనసాగించనున్నామని చెప్పారు. వినాయక చవితి రోజున మండపం ఏర్పాటు చేసి పూజ చేసే సంప్రదాయం దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో కూడా అలాంటి చైతన్యాన్ని పెంపొందించడమే ఈ గణేష్ మండపాల ఉద్దేశమని పేర్కొన్నారు.

ఎనిమిది పబ్లిక్ గణేష్ మండళ్లు గణేష్ పూజను నిర్వహించడానికి ప్లాన్ చేసిన ఎనిమిది ప్రదేశాలలో ఒకటి శ్రీనగర్‌లోని లాల్ చౌక్. అయితే ఈ మండపం ఏర్పాటు చేస్తున్నట్లు చేసిన ప్రకటన చాలా ఆలస్యం అయింది. వచ్చే ఏడాది నుంచి ఈ ప్లాన్ అమలులోకి వస్తుంది. పూణేలోని ఈ ఎనిమిది గణేశోత్సవ మండళ్లు విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సమాచారాన్ని వెల్లడించాయి.

జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ గణేశోత్సవం కోసం ఏర్పాటు చేసే విగ్రహాలను పూణేలోనే  సిద్ధం చేయనున్నారు. వాటిని జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రతిష్టించనున్నారు. ప్రారంభంలో ఒకటిన్నర రోజు గణపతిని మండపంలో ప్రతిష్టించి పూజాదికార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాశ్మీరీ ప్రజలకు  పాకిస్తాన్ , ఉగ్రవాదులపై పోరాటానికి బలం చేకూర్చడానికి.. మరింత వేగంగా దేశ ప్రధాన స్రవంతితో  అనుసంధానించడానికి అక్కడి వారిలో ఉత్సాహాన్ని పెంచడానికి ఈ ప్రణాళిక సిద్ధం చేయబడినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

జమ్మూ కాశ్మీర్‌లో గణేశోత్సవం కోసం ఎనిమిది ప్రదేశాలు ఎంచుకున్నారు. వాటిలో శ్రీనగర్‌లోని లాల్ చౌక్, పుల్వామా, కుప్వారా, బారాముల్లా, అనంతనాగ్, ఖుర్హాన్, షోపియాన్ ఉన్నాయి. పూణెలో మోర్యా కార్యకరి మంచ్‌ని ఏర్పాటు చేయబోతున్నామని ఎనిమిది గణేష్ మండళ్లు కలిసి ప్రకటించాయి. ఈ ఏర్పాట్ల వలన స్థానిక కార్మికులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. గణేశోత్సవ సమితి కార్యకర్తలకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఈ సంవత్సరం, ఈ ఎనిమిది గణేశోత్సవ కమిటీలు దేశప్రజలు కలిసి గణేష్ పూజను సోదరభావంతో జరుపుకోవాలని శుభాకాంక్షలు అందించాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)