AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: వృద్ధురాలు మృత దేహం ఎదుట నవ్వుతూ ఫ్యామిలీ ఫోటో.. వివాదాస్పదం అవుతున్న కుటుంబ సభ్యుల తీరు.. స్పందించిన మంత్రి

మల్లాపల్లికి చెందిన ఓ పెద్ద కుటుంబం.. ఒక వృద్ధ మహిళ మృతదేహాన్ని ఉంచిన గాజు శవపేటిక చుట్టూ కుటుంబ సభ్యులు నవ్వుతూ గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఆ పెద్ద కుటుంబంలోని 95 ఏళ్ల మరియమ్మ అనే వృద్ధురాలిది.

Viral Photo: వృద్ధురాలు మృత దేహం ఎదుట నవ్వుతూ ఫ్యామిలీ ఫోటో..  వివాదాస్పదం అవుతున్న కుటుంబ సభ్యుల తీరు.. స్పందించిన మంత్రి
Gave A Happy Farewell
Surya Kala
|

Updated on: Aug 24, 2022 | 2:29 PM

Share

Viral Photo: ఎంత వయసు వచ్చినా తమ కుటుంబ సభ్యులు తమకు ప్రియమైన వారు జీవించి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే సృష్టిలో ప్రతి జీవికి మరణం తప్పదు. దీంతో తమ ఫ్యామిలీలో ఎవరైనా మరణిస్తే.. ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణాతీతం. వయసుతో సంబంధం లేకుండా వారితో ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని తలచుకుంటూ.. విలపిస్తారు. అయితే  ఓ కుటుంబం మాత్రం.. తమ ఇంటి పెద్ద మరణిస్తే.. ఆ మృతదేహం చుట్టూ.. నిల్చుని.. అదేదో పండగలా భావించి నవ్వుతూ ఫోటో తీసుకున్నారు. అంతేకాదు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ కుటుంబ సభ్యుల తీరుపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘటన  కేరళలోని పతనంతిట్టాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మల్లాపల్లికి చెందిన ఓ పెద్ద కుటుంబం.. ఒక వృద్ధ మహిళ మృతదేహాన్ని ఉంచిన గాజు శవపేటిక చుట్టూ కుటుంబ సభ్యులు నవ్వుతూ గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఆ పెద్ద కుటుంబంలోని 95 ఏళ్ల మరియమ్మ అనే వృద్ధురాలిది. ఈ నెల 17న కన్నుమూసింది. ఆమె అంతిమ యాత్ర సందర్భంగా శవపేటిక దగ్గర నిలబడిన కుటుంబ సభ్యులు నవ్వుతూ ఫోటో తీసుకున్నారు. దీంతో ఫ్యామిలీ సభ్యుల తీరుపై పలువురు విమర్శిస్తున్నారు. కుటుంబం అనుచితంగా ప్రవర్తిస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు. తమకు అత్యంత ప్రియమైన వ్యక్తులు మరణిస్తే.. అసలు ఎవరైనా ఇలా నవ్వగలరా అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే తమ ఫోటోపై వస్తున్న విమర్శలకు కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు. తమ ఫ్యామిలీకి మరియమ్మ 95 ఏళ్ల పాటు ఎంతో ప్రేమను ఇచ్చారని.. కష్ట సుఖాల్లో తమకు అండగా ఉంటూ.. సంతోషంగా జీవించారని తెలిపారు. దీంతో తాము ఆమెకు ఘనంగా వీడ్కోలు ఇచ్చామని తెలిపారు. మరియమ్మకు తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు.. ఆ పిల్లలు అందరూ తమ తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మరియమ్మ దాదాపు ఏడాది పాటు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ.. ఆగష్టు 17న కన్నుమూశారు. వైరల్ అవుతున్న ఫోటో ఆగస్టు 19న తీయబడింది.

ఇవి కూడా చదవండి

మరియమ్మ మరణానంతరం తాము తమ తల్లి జ్ఞాపకాలను నెమరువేసుకోవాలనుకున్నామని మరియమ్మ బంధువులు తెలిపారు. అందుకనే మృతదేహం పక్కన చిరునవ్వుతో ఉన్న ఫోటోను ఉద్దేశపూర్వకంగా తీసుకున్నామని చెప్పారు. అంత్యక్రియలకుమరియమ్మ కోసం సుమారు 24 గంటలు ప్రార్థించిన తర్వాత.. శవపేటిక వద్ద కుటుంబమంతా కలిసి కూర్చుని ఫోటో తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరణిస్తే కన్నీరు పెట్టడం  అలవాటుపడిన వ్యక్తులు తమ ఫోటోను అంగీకరించలేరని వారు తెలిపారు.

ఈ ఫోటో వ్యక్తిగత కుటుంబ జ్ఞాపకార్థం తీసుకున్నామని.. బయటి వ్యక్తులకు ఎలా లీక్ అయిందో తమకు తెలియదని బంధువులు తెలిపారు. తమ క్రైస్తవ విశ్వాసం ప్రకారం స్వర్గానికి వెళుతున్న తమ తల్లికి వీడ్కోలు పలుకుతున్నందున.. ఫోటో తీసుకున్నందుకు తాము చింతించడం లేదని కూడా చెప్పారు.

మరోవైపు ఫేస్‌బుక్ లో వైరల్ అవుతున్న ఫోటోపై కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి స్పందించారు. నెగెటివ్ కామెంట్స్ వద్దని నెటిజన్లను కోరారు. “మరణం బాధాకరం. ఇంతకాలం ఆనందంగా జీవించిన వారికి నవ్వుతూ వీడ్కోలు పలకడం కంటే సంతోషం ఏముంటుంది? ఈ ఫోటోకు నెగెటివ్ కామెంట్స్ అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..