Viral Video: హైవేపై ఒక్కసారిగా దిగిన విమానం.. ల్యాండింగ్ సీన్ చూసి హడలిపోయిన జనం
Florida Plane Crash Landing: అమెరికాలో ఓ చిన్న విమానం రోడ్డుపై క్రాష్ ల్యాండింగ్ జరిగింది. ఈ వీడియో ఇప్పుడు గూస్‌బంప్స్ క్రియేట్ చేస్తోంది.
విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, క్రాష్ ల్యాండింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఈ తరహా ల్యాండింగ్‌ను ఖాళీ పొలాల్లోనే చేస్తుంటారు. అయితే రహదారిపై విమానం క్రాష్ ల్యాండింగ్‌ను ఎప్పుడైనా చూసారా. అవును, మీరు చదివింది పూర్తిగా నిజమే. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింగిల్ ఇంజన్ విమానం రోడ్డుపై ఎలా కూలిపోతుందో ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఆశ్చర్యం ఏంటంటే.. రోడ్డుపై వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. అదే సమయంలో ఒక్కసారిగా ఓ చిన్న విమానం రోడ్డుకు అడ్డంగా దూసుకురావడంతో అక్కడే ఉన్నవారంతా వణికిపోయారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని రద్దీగా ఉండే వీధిలో శుక్రవారం ఓ చిన్న విమానం కూలిపోయింది. అప్పటి నుంచి ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వర్సిటీ సమీపంలో క్రాష్ ల్యాండింగ్
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సింగిల్ ఇంజిన్ సెస్నా 182 నార్త్ ఐకాన్‌లాక్‌చాచీ ట్రైల్‌లోని యూనివర్శిటీ బౌలేవార్డ్ సమీపంలో సాయంత్రం 4 గంటలకు అత్యవసరంగా ల్యాండింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు.
A pilot suffered minor injuries after a crash-landing on a busy street in Orlando, Florida, on Friday, August 19. pic.twitter.com/fRHKx3fbIf
— Storyful (@Storyful) August 23, 2022
వైరల్ వీడియో..
విమాన ప్రమాదం కారణంగా సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి కొన్ని మైళ్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వేళ్తున్న కార్లు ఒక్కసారిగా రోడ్డుకు పక్కగా నిలిచిపోవడంతో.. ఆ విమానం రోడ్డుకు ఒకవైపు కుప్పకూలడాన్ని ఈ వైరల్ వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి తన కారులోంచి రికార్డు చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం