AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: యంగ్ ఏజ్ లో ఎలాన్ మస్క్ అలా.. ప్రపంచ కుబేరుడి ఫోటోలు వేలానికి పెట్టిన మాజీ గర్ల్ ఫ్రెండ్..

చిన్నప్పటి గుర్తులంటే అందరికీ ఎంతో ఇష్టం.. ఎన్ని కష్టాలు వచ్చినా ఆనాటి స్మృతులను పదిలంగా ఉంచుకుంటాం. అదే మనం ప్రేమించిన వ్యక్తి ఇచ్చిన బహుమతులు అయితే ఎంతో అపురూపంగా చూసుకుంటాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా..

Elon Musk: యంగ్ ఏజ్ లో ఎలాన్ మస్క్ అలా.. ప్రపంచ కుబేరుడి ఫోటోలు వేలానికి పెట్టిన మాజీ గర్ల్ ఫ్రెండ్..
Amarnadh Daneti
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 24, 2022 | 5:09 PM

Share

Elon Musk: చిన్నప్పటి గుర్తులంటే అందరికీ ఎంతో ఇష్టం.. ఎన్ని కష్టాలు వచ్చినా ఆనాటి స్మృతులను పదిలంగా ఉంచుకుంటాం. అదే మనం ప్రేమించిన వ్యక్తి ఇచ్చిన బహుమతులు అయితే ఎంతో అపురూపంగా చూసుకుంటాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని చెక్కు చెదరకుండా.. మన ప్రాణంలా కాపాడుకుంటాం.. కాని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాజీ ప్రియురాలు తన మాజీ ప్రియుడు ఇచ్చిన బహుమతులు, గతంలో ఎలాన్ మస్క్ తో దిగిన ఫోటోలను వేలానికి పెట్టింది. నిజమా అని ఆశ్చర్యపోతున్నారా.. అవును ఇది నిజం.. ఎందుకో తెలిస్తే మరింత షాక్ అవుతారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కెందుకు టెస్లా సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో గతంలో దిగిన, మునుపెన్నడూ ఎవరూ చూడని ఫోటోలను మాజీ గర్ల్ ఫ్రెండ్ జెన్నిఫర్ గ్విన్ వేలానికి పెట్టింది. ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిలియనీర్ ఎలాన్ మస్క్ మాజీ ప్రియురాలికి ఇన్ని కష్టాలా అంటూ నెటిజన్లు ఆమెపై సానుభూతి చూపిస్తున్నారు.

ఎలాన్ మస్క్, జెన్నిఫర్ గ్విన్ జంటగా దిగిన ఫోటోలతో పాటు.. పాత బహుమతులను వేలానికి ఉంచింది. చిత్రాలతో పాటు దాదాపు 20 ఐటమ్స్ ని వేలానికి పెట్టినట్లు తెలుస్తోంది. RR ఆక్షన్ వెబ్ సైట్ లో లిస్ట్ అయిన ఈవస్తువుల వేలం సెప్టెంబర్ 14వ తేదీతో ముగుస్తుంది. ఫోటోలతో పాటు తన మాజీ ప్రియుడు, బిలియనీర్ ఎలాన్ మస్క్ సంతకం చేసిన పుట్టిన రోజు కార్డును కూడా వేలానికి పెట్టింది జెన్నిఫర్ గ్విన్. ‘హ్యాపీ బర్త్ డే బూ-బూ’ లవ్ ఎలోన్ అని రాసి ఉన్న కార్డును అమ్మకానికి పెట్టింది. ఎలాన్ మస్క్ 20 ఏళ్ల వయస్సులో అప్పటి తన ప్రియురాలు జెన్నిఫర్ గ్విన్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, మస్క్ సంతకం చేసిన 1 డాలర్ బిల్లు ఈవేలంలో ఉంచారు. పెట్టిన రోజు సందర్భంగా జెన్నిఫర్ గ్విన్ కి ఇచ్చిన 14కే బంగారు నెక్లెస్ ను కూడా వేలంలో పెట్టింది. ఎలాన్ మస్క్ రూంలో స్నేహితులతో కలిసినవి, పెన్సిల్వేనియా యూనివర్సిటీ క్యాంపస్ చుట్టూ సరదాగా గడిపిన పిక్స్ ఈవేలంలో ఉన్నాయి.

Elon Musk

Elon Musk

1995లో తన ప్రియురాలు జెన్నిఫర్ గ్విన్ కు ఎలాన్ మస్క్ ఇచ్చిన పుట్టినరోజు కార్డు వేలం ధర ఇప్పటికే 1300 డాలర్లకు చేరుకుంది. దీని విలువను 10వేల డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డాలర్ బిల్ పై వేలం నడుస్తోంది. ఈ ఒక్కటే 5,000డాలర్ల కంటే ఎక్కువ పలుకుతుందని అంచనా వేస్తున్నారు. జెన్నిఫర్ గ్విన్ తన సవతి కుమారుడు ట్యూషన్ ఫీజు కోసం డబ్బును సేకరించడానికి ఈవస్తువులను వేలం వేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె సౌత్ కరోలినాలో నివసిస్తోంది. ఎలాన్ మస్క్ 1994-195 మధ్య గ్విన్ తో డేటింగ్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈవేలంపై ఇంకా స్పందిచలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..