AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: బీహార్‌లో టెన్షన్.. టెన్షన్.. అసెంబ్లీలో బల పరీక్షకు ముందు ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు..

జేడీయూ, ఆర్జేడీ, పలు పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోజు అసెంబ్లీలో బలనిరూపణ కూడా (ఫ్లోర్ టెస్ట్) జరగనుంది. ఈ తరుణంలోనే బీహార్‌, జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు చేయడం ఒక్కసారిగా రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది.

Bihar: బీహార్‌లో టెన్షన్.. టెన్షన్.. అసెంబ్లీలో బల పరీక్షకు ముందు ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు..
Bihar
Shaik Madar Saheb
|

Updated on: Aug 24, 2022 | 9:49 AM

Share

CBI raids RJD MLC Sunil Singh house: బీహార్‌లో ఇటీవలనే మహాకూటమి సర్కార్ ఏర్పడిన విషయం తెలిసిందే. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ, ఆర్జేడీ, పలు పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోజు అసెంబ్లీలో బలనిరూపణ కూడా (ఫ్లోర్ టెస్ట్) జరగనుంది. ఈ తరుణంలోనే బీహార్‌, జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ, సీబీఐ దాడులు చేయడం ఒక్కసారిగా రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. బీహార్లో ఆర్జేడీ నేతల ఇళ్లపై బుధవారం ఉదయం నుంచి ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ సునీల్ సింగ్ ఇంట్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. సునీల్ ఆర్జేడీ కోశాధికారిగా కొనసాగుతున్నారు సునీల్ సింగ్ లాలూకు సునీల్ సింగ్ అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆర్జేడీ ఎంపీ అష్పక్ కరీమ్ ఇంట్లోనూ ఈడీ బృందం సోదాలు నిర్వహిస్తోంది. అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ముందు ఇలా జరగడంతో బీహార్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కింది. ఈడీ దాడులపై ఆర్జేడీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఈ దాడులపై RJD MLC, బిస్కమాన్ పాట్నా ఛైర్మన్ సునీల్ సింగ్ స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నారని.. ఇందులో అర్థం లేదంటూ పేర్కొంటున్నారు. ఇలా చేస్తే ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా వస్తారని, భయపెట్టేందుకు ఇలా చేస్తున్నారంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

పాట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, ఎంపీ అష్పక్ కరీమ్ ఇళ్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రత మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు. నివేదికల ప్రకారం.. భూ ఆక్రమణ, అక్రమ మైనింగ్, రైల్వే ఉద్యోగ నియామకాల్లో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసులో సీబీఐ రెండు రాష్ట్రాల్లో చర్యలు ప్రారంభించినట్లు పేర్కొంటున్నారు.

వీరిలో పెద్ద నాయకులతో సంబంధాలున్నట్లు భావిస్తున్న ప్రేమ్ ప్రకాష్ ను సైతం ప్రశ్నిస్తున్నారు. ఇది కాకుండా జార్ఖండ్‌లో సిఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్యే ప్రతినిధి పంకజ్ మిశ్రాను ప్రశ్నించిన తర్వాత ఈ దాడులు జరుగుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..