AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: అందుబాటులోకి అత్యాధునిక వైద్యం.. మరో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్న పీఎం మోడీ..

పంజాబ్‌లోని న్యూ చండీగఢ్‌లో నిర్మించిన హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించనున్నారు.

PM Narendra Modi: అందుబాటులోకి అత్యాధునిక వైద్యం.. మరో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్న పీఎం మోడీ..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Aug 24, 2022 | 7:26 AM

Share

Chandigarh cancer hospital: వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన మోడీ సర్కార్.. క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో క్యాన్సర్ ఆసుపత్రులను నిర్మించి అందరికీ చికిత్స అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. తాజాగా.. కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌లో 660 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రి కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. పంజాబ్‌లోని న్యూ చండీగఢ్‌లో నిర్మించిన హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) బుధవారం ప్రారంభించనున్నారు. దాదాపు రూ.660 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రిని నిర్మించింది. ఈ క్యాన్సర్ ఆసుపత్రిని కేంద్రం 300 పడకల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించింది. దీనిలో శస్త్రచికిత్స, రేడియోథెరపీ, మెడికల్ ఆంకాలజీ – కెమోథెరపీ , ఇమ్యునోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి చికిత్సలతోపాటు పరిశోధనలు చేయనున్నారు.

కాగా.. పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులు బాగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు తక్కువ ధరకే క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లవలసి వస్తోంది. బటిండా ప్రాంతం నుంచి వెళ్లే ఒక రైలును క్యాన్సర్ రైలు అని పిలుస్తారంటే.. సమస్య ఎలా ఉందో ఒకసారి ఊహించుకోవచ్చు. దీంతో కేంద్రం ఈ ముఖ్యమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. న్యూ చండీగఢ్‌లోని ఈ ఆసుపత్రి క్యాన్సర్ కేర్‌కు కేంద్రంగా పని చేస్తుందని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం సంగ్రూర్‌లో నిర్మించిన 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రి సైతం 2018 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ఆసుపత్రి పొరుగు రాష్ట్రాల రోగులకు కూడా సహాయం చేస్తుంది.

ఇదిలాఉంటే.. ప్రధాని మోడీ ఇటీవల ప్రధాన క్యాన్సర్ ఆసుపత్రులను ప్రారంభించారు. 2022 ఏప్రిల్ 28న దిబ్రూఘర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అస్సాంలోని దేశంలోని ఏడు క్యాన్సర్ ఆసుపత్రులను ప్రజలకు అంకితం చేశారు. ఈ క్యాన్సర్ ఆసుపత్రులు దిబ్రూఘర్, కోక్రాఝర్, బార్పేట, దర్రాంగ్, తేజ్‌పూర్, లఖింపూర్, జోర్హాట్‌లలో నిర్మించారు. దీంతోపాటు ప్రధాని మరో ఏడు కొత్త క్యాన్సర్ ఆసుపత్రులకు కూడా శంకుస్థాపన చేశారు. అంతకుముందు.. జనవరి 7న కోల్‌కతాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రెండవ క్యాంపస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ 460 పడకల ఆసుపత్రిని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..