AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendra Pradhan: ఆస్ట్రేలియా అభివృద్ధిలో భారతీయ విద్యార్థుల సహకారం అధ్భుతం.. సిడ్నీ వేదికగా ప్రశంసలు..

ఆస్ట్రేలియా అభివృద్ధిలో భారతీయ విద్యార్థుల సహకారం ఎంతో ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సిడ్నీలో అన్నారు.

Dharmendra Pradhan: ఆస్ట్రేలియా అభివృద్ధిలో భారతీయ విద్యార్థుల సహకారం అధ్భుతం..  సిడ్నీ వేదికగా ప్రశంసలు..
Dharmendra Pradhan
Sanjay Kasula
|

Updated on: Aug 23, 2022 | 9:31 PM

Share

ఆస్ట్రేలియా అభివృద్ధిలో భారతీయ విద్యార్థుల సహకారం అద్భుతమన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లారు ధర్మేంద్ర ప్రధాన్. సిడ్నీలో ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జాసన్ క్లేర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో ఆస్ట్రేలియా- ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్ (AIEC) 6వ సమావేశానికి ఆస్ట్రేలియా విద్యా శాఖ మంత్రి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్ట్రేలియా అభివృద్ధికి భారతీయులు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అలాగే ఆస్ట్రేలియా కంటే భారత్‌లో ఉన్నత విద్యనభ్యసించే వారి రేటు చాలా ఎక్కువగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆరవ సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ కూడా భారతీయ విద్యార్థుల పెండింగ్ వీసాల సమస్యను లేవనెత్తారు. ఈ ఏడాది చివరిలోగా భారత్‌లో పర్యటించాల్సిందిగా జాసన్ క్లైర్‌ను ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆహ్వానించారు. భారతదేశం-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి విద్యను కీలక స్తంభంగా మార్చడానికి, నైపుణ్యాలు, పరిశోధనలో సహకారాన్ని విస్తరించడానికి కూడా ఇద్దరు మంత్రులు అంగీకరించారు.

ఇవి కూడా చదవండి

విద్యాశాఖ మంత్రి ట్వీట్..

నైపుణ్యాభివృద్ధిపై విద్యాశాఖ మంత్రి..

ఆయుర్వేదం, యోగా, వ్యవసాయం తదితర రంగాల్లో రెండు దేశాల మధ్య పరిశోధన సహకారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉద్ఘాటించారు. స్కిల్ సర్టిఫికేషన్, మైనింగ్, లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ వంటి రంగాలలో కూడా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వృత్తి విద్య, నైపుణ్యాలకు సంబంధించి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను నెలకొల్పడమే తన పర్యటన ప్రధాన ఉద్దేశమన్నారు.

డిజిటల్ విశ్వవిద్యాలయాలు, గతి శక్తి విశ్వవిద్యాలయాలను కూడా భారత్ ఏర్పాటు చేసిందన్నారు. దీని కోసం పాఠ్యాంశాలు, ఇతర అంశాలను అభివృద్ధి చేయడానికి ఇరు దేశాలు కలిసి పనిచేయగలవనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

స్టూడెంట్ వీసా సమస్య..

సిడ్నీ యూనివర్సిటీలో జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆరో సమావేశంలో ఆస్ట్రేలియా వెళ్లే భారతీయ విద్యార్థుల పెండింగ్ వీసాల అంశాన్ని కూడా ధర్మేంద్ర ప్రధాన్ లేవనెత్తారు. పెండింగ్‌లో ఉన్న వీసాలను వేగవంతం చేయడంలో సహకారం అందిస్తామని ఆస్ట్రేలియా మంత్రి హామీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి తన ప్రసంగంలో, ఆస్ట్రేలియా కంటే భారతదేశం భౌగోళికంగా పెద్ద దేశమని.. భారతదేశంలో జనాభా కూడా ఇక్కడ కంటే ఎక్కువగా ఉందని అన్నారు. చదువు విషయంలో ఆస్ట్రేలియాలో తొమ్మిదిన్నర వేల పాఠశాలలు ఉండగా.. భారత్‌లో పదహారు లక్షలకు పైగా పాఠశాలలు ఉన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ, జాతీయ వార్తల కోసం