AP DSC: లిమిటెడ్ డీఎస్సీ నోటిఫికేషన్.. వారికి మాత్రం 20 శాతం వెయిటేజ్.. చివరి తేదీ..
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల (AP DSC) భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 502 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల (AP DSC) భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 502 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జెడ్పీ, ఎంపీపీ స్కూల్స్‌లో 199 పోస్టులు, మోడల్ స్కూల్స్‌లో 207 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే మున్సిపల్ స్కూల్స్‌లలో 15, స్పెషల్ ఎడ్యూకేషన్ పోస్టులు 81 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, మ్యూజిక్ ఉపాధ్యాయులు, ఆర్ట్ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్ (స్కూల్ అసిస్టెంట్స్), ఏపీ మోడల్ స్కూల్స్, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకానికి గాను ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
డీఎస్పీలో టెట్ మార్కెలకు 20 శాతం వెయిటేజ్ కేటించారు. ఫీజు చెల్లింపు గడువు ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 17 వరకు ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్ 4న ఫలితాలు విడుదల చేయనున్నారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఆగస్టు 23వ తేదీన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.
మరిన్ని ఏపీ, కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం