Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiration: కళ్లు లేకున్నా కలల ప్రయాణం ఆపలేదు.. ఏకంగా మైక్రోసాఫ్ట్‌లో జాబ్‌.. ప్యాకేజీ తెలిస్తే ఆశ్చర్యపోతారు

Jharkhand: చిన్నకష్టం వస్తేనే వివిల్లాడిపోయేవారు చాలామంది ఉంటారు. లక్ష్య సాధనలో అడ్డంకులు, అవరోధాలు ఎదురైతే కుంగిపోతారు. మనవల్లకాదులే అంటూ నిరాశతో వెనకడుగువేస్తుంటారు. ఇంకొందరు పరిస్థితులను ఎదుర్కొలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.

Inspiration: కళ్లు లేకున్నా కలల ప్రయాణం ఆపలేదు.. ఏకంగా మైక్రోసాఫ్ట్‌లో జాబ్‌.. ప్యాకేజీ తెలిస్తే ఆశ్చర్యపోతారు
Saurabh Prasad
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Aug 24, 2022 | 7:43 AM

Jharkhand: చిన్నకష్టం వస్తేనే వివిల్లాడిపోయేవారు చాలామంది ఉంటారు. లక్ష్య సాధనలో అడ్డంకులు, అవరోధాలు ఎదురైతే కుంగిపోతారు. మనవల్లకాదులే అంటూ నిరాశతో వెనకడుగువేస్తుంటారు. ఇంకొందరు పరిస్థితులను ఎదుర్కొలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అలాంటిది 11 ఏళ్ల ప్రాయంలోనే కంటిచూపు కోల్పోయిన వ్యక్తి.. అందరి కళ్లు తనవైపు తిరిగిలా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంగవైకల్యం చదువుకు అడ్డురాదంటూ పెద్ద చదువులు అభ్యసించాడు. ఏకంగా క్యాంప‌స్ ప్లేస్‌మెంట్‌లో మైక్రోసాఫ్ట్ నుంచి రూ.51 ల‌క్షల ప్యాకేజీతో జాబ్ ఆఫ‌ర్ పొందాడు. తద్వారా తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచాడు. అతనే జార్ఖండ్‌కు చెందిన సౌర‌భ్‌ప్రసాద్‌ (Saurabh Prasad). ఛత్రా జిల్లాలోని తాండ్వా బ్లాక్‌లోని చట్టిగాడిలాంగ్ గ్రామానికి చెందిన సౌరభ్ ప్రసాద్ చిన్నతనంలోనే గ్లకోమా అనే వ్యాధితో బాధపడ్డాడు. దీని కారణంగా 11 ఏళ్లకే తన కంటి చూపును కోల్పోయాడు. అయితే దానికేమీ అతను కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో తన కలల ప్రయాణం వైపు పయనించసాగాడు. అంధత్వం కారణంగా ఎదురైన అన్ని ప్రతికూల పరిస్థితులను ధైర్యంతో అధిగమించాడు. అందుకు తల్లిదండ్రులు కూడా సహకరించారు.

సౌరభ్ తండ్రి ఓ టీచర్, తల్లి గృహిణి. వారి ప్రోత్సాహంతో చదువులో రాణించాడు. సెయింట్ మైఖేల్స్ రాంచీలో ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కు చదువుకున్నాడు సౌరభ్‌. అనంత‌రం IBS డెహ్రాడూన్‌లో చేరాడు. అక్కడ నుంచి బోర్డ్ పరీక్షల్లో 97 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఇంటర్‌లో 93 శాతం మార్కులు తెచ్చుకున్నాడు. ఆతర్వాత ఐఐటీ ఢిల్లీలో చేరి.. ప్రస్తుతం కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలోమైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన సౌరభ్‌ క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలో సెలెక్టయ్యాడు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ నుంచి రూ.51 ల‌క్షల వేతనంతో కళ్లు చెదిరే జాబ్ ఆఫ‌ర్‌ను కొట్టేశాడు. తన విజయానికి తన వెన్నంటి నిలిచిన తల్లిదండ్రులే కారణమంటున్నాడు సౌరభ్. తన వైకల్యాన్ని చూసి ఏనాడూ కుంగిపోలేదంటున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..