Health Tips: నీళ్లు తక్కువగా తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు.. తస్మాత్ జాగ్రత్త
Health Care Tips: మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే సరైన మోతాదులో నీరు తాగడం ఎంతో ముఖ్యం. లేకపోతే బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది.
Health Care Tips: మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే సరైన మోతాదులో నీరు తాగడం చాలా ముఖ్యం. లేకపోతే బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. మన శరీరంలో సుమారు 60 శాతం నీరు ఉంటుంది. కాబట్టి శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలంటే సరైన మోతాదులో నీరు తాగడం చాలా ముఖ్యం. ఇది మీ శరీరాన్ని అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అయితే పని ఒత్తిడిలో పడి చాలామంది సరిగా నీళ్లు తాగడం లేదు. ఫలితంగా ఆరోగ్య సమస్యలను చేతులారా కొని తెచ్చుకుంటున్నారు. మరి ఆ సమస్యలేంటో తెలుసుకుందాం రండి.
ఊబకాయం స్థూలకాయ సమస్య అనేక వ్యాధులను తెచ్చిపెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నీరు తాగడం వల్ల ఊబకాయం సమస్య మరింత పెరుగుతుంది. చాలా సమయాల్లో మనం ఎక్కువగా తింటాం. అయితే నీళ్లు మాత్రం తాగం. ఫలితంగా ఊబకాయం సమస్యలు పెరుగుతాయి. ఇక నీరు తాగకపోవడం వల్ల ఆకలి మరింత పెరుగుతుంది. దీని వల్ల మరింత బరువు పెరుగుతారు. కాబట్టి శరీరంలో తగినంత నీరు ఉండటం చాలా ముఖ్యం.
ఉదర సమస్యలు.. తక్కువ నీరు తాగడం వల్ల మలబద్ధకం లాంటి ఉదర సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే శరీరంలో నీటి స్థాయులు తగ్గడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయులు పెరుగుతాయి. ఇది కడుపులో గ్యాస్ ఏర్పడడానికి కారణమవుతుంది. అంతే కాకుండా నీరు తక్కువగా తాగడం వల్ల గుండెల్లో మంట వస్తుంది.
నోటి దుర్వాసన నీరు తక్కువగా తాగడం వల్ల నోటి దుర్వాసన సమస్య గణనీయంగా పెరుగుతుంది. తక్కువగా నీరు తాగడం వల్ల నోరు ఎండిపోతుంది. ఫలితంగా నోటిలో బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దీంతో నోటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. కాబట్టి నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు త్రాగాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..