Shruti Haasan: రెమ్యునరేషన్‌ భారీగా పెంచేసిన శ్రుతి.. ఏకంగా అన్ని కోట్లు డిమాండ్‌ చేస్తోందా?

Shruti Haasan: లోకనాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) తనయగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రుతిహాసన్‌. ఆతర్వాత తన సొంత ట్యాలెంట్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కేవలం అభినయ పరంగానే కాకుండా సింగర్‌గానూ మెప్పిస్తోంది.

Shruti Haasan: రెమ్యునరేషన్‌ భారీగా పెంచేసిన శ్రుతి.. ఏకంగా అన్ని కోట్లు డిమాండ్‌ చేస్తోందా?
Shruthi Haasan
Follow us
Basha Shek

|

Updated on: Aug 20, 2022 | 11:24 AM

Shruti Haasan: లోకనాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) తనయగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రుతిహాసన్‌. ఆతర్వాత తన సొంత ట్యాలెంట్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కేవలం అభినయ పరంగానే కాకుండా సింగర్‌గానూ మెప్పిస్తోంది. అయితే వ్యక్తిగత కారణాలతో సినిమా ఇండస్ట్రీకి మూడేళ్ల పాటు దూరమైంది. అయితే రవితేజ క్రాక్‌ (KracK) సినిమాతో ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత పవన్‌ కల్యాణ్‌తో కలిసి వకీల్‌సాబ్‌ సినిమాతో బ్లాక్‌బస్టర్‌హిట్‌ కొట్టింది. ప్రస్తుతం పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో కలిసి సలార్‌ సినిమాలో నటిస్తోంది. ఇక గోపిచంద్‌ మలినేని- బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న NBK 107 (వర్కింగ్‌ టైటిల్‌)లోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్‌. వీటితో పాటు మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కే.ఎస్‌.రవీంద్ర రూపొందిస్తోన్న మెగా154లోనూ శ్రుతినే కథానాయికగా ఎంపికైంది. ఇలా క్రేజీ ప్రాజెక్టులతో బిజిబిజీగా గడుపుతోన్న ఈ సొగసరి గురించి ఫిల్మ్‌సర్కిల్‌లో ఒక వార్త వినిపిస్తోంది.

వరుస విజయాలతో పాటు భారీ ప్రాజెక్టులు చేతిలో ఉండడంతో శ్రుతి కూడా రెమ్యునరేషన్‌ను పెంచేసిందట. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను నిజం చేస్తూ పారితోషకాన్ని అమాంతం పెంచేసిందట. గతంలో ఒక సినిమాకు కోటి, కోటిన్నర తీసుకునే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం2.5-3 కోట్ల వరకు డిమాండ్‌ చేస్తుందట. సక్సెస్‌ రేట్‌ బాగా ఉండడంతో దర్శక నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మ డిమాండ్లను ఓకే చెబుతున్నారట. ఇదిలా ఉంటే సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించేందుకు ఆసక్తి చూపుతోందట శ్రుతి. గతంలో ఆంథాలజీ మూవీగా తెరకెక్కిన పిట్టకథలులో కనిపించిన ఈ ముద్దుగుమ్మ కంటెంట్‌ నచ్చితే మరికొన్ని సిరీస్‌ల్లోనూ నటించేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తోందట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..