Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Water: ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు.. ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Coconut Water Benefits: కొబ్బరి నీళ్లలో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. పైగా రుచికరంగానూ ఉంటాయి. ప్రత్యేకించి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. పైగా కొబ్బరి నీళ్లలో క్యాలరీలు..

Coconut Water: ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు.. ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Coconut Water
Follow us
Basha Shek

|

Updated on: Aug 19, 2022 | 6:11 PM

Coconut Water Benefits: కొబ్బరి నీళ్లలో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. పైగా రుచికరంగానూ ఉంటాయి. ప్రత్యేకించి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. పైగా కొబ్బరి నీళ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని సూపర్‌ డ్రింక్‌గా ఆరోగ్య నిపుణులు పరిగణిస్తారు. ఇందులోని పోషకాలు శరీరాన్ని నిర్వీషీకరణం చేస్తాయి. హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. ఇక ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి పలు ప్రయోజనాలు చేకూరుతాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

బరువు తగ్గడంలో..

కొబ్బరి నీళ్లలో పొటాషియం, బయోయాక్టివ్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి శరీరంలో జీవక్రియను పెంచడానికి సహకరిస్తాయి. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో క్యాలరీలు కరిగిపోతాయి. కాబట్టి సులభంగా బరువు తగ్గచ్చు. పైగా ఈ నీళ్లను తాగడం వల్ల మనసుకు రిఫ్రెష్‌గానూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

హైడ్రేటెడ్‌గా..

కొబ్బరి నీళ్లలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అదేసమయంలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వ్యాయామం చేసేటప్పుడు కొబ్బరి నీళ్లు తాగొచ్చు. ఫలితంగా మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. అలసట, నీరసం, బలహీనత, తల తిరగడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొండడంలో కొబ్బరి నీరు మంచిగా పనిచేస్తుంది.

కొలెస్ట్రాల్‌ను కరిగించుకునేందుకు..

శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవడానికి కొబ్బరి నీళ్లు బాగా పనిచేస్తాయి. అదేవిధంగా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

కిడ్నీ స్టోన్స్‌

మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఇలాంటి సమయాల్లో డైట్‌లో కచ్చితంగా కొబ్బరి నీళ్లను చేర్చుకోవచ్చు. ఇందులోని పోషకాలు శరీరంలోని ట్యాక్సి్న్లను బయటకు పంపడంలో సహాయపడతాయి. అలాగే కిడ్నీలో రాళ్లను తొలగిస్తాయి.

మెరిసే చర్మం కోసం

కొబ్బరి నీళ్లలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలతో పోరాడడంలో సహాయపడతాయి. కొబ్బరి నీళ్లలోని పోషకాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతాయి. ఆరోగ్యకరమైన చర్మం కోసం ఈ నీటిని కూడా క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.

అధిక రక్త పోటు

కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ట్రంప్ టారిఫ్ మోత.. భారత్‌కు తప్పదా వాత?
ట్రంప్ టారిఫ్ మోత.. భారత్‌కు తప్పదా వాత?
జానీ మాస్టర్ కూతురి బర్త్ డే వేడుకల్లో సినీ తారలు.. ఫొటోస్ ఇదిగో
జానీ మాస్టర్ కూతురి బర్త్ డే వేడుకల్లో సినీ తారలు.. ఫొటోస్ ఇదిగో
అలర్ట్: ఈ వస్తువులను తాకితే వెంటనే చేతులు కడగాలట..!
అలర్ట్: ఈ వస్తువులను తాకితే వెంటనే చేతులు కడగాలట..!
గుడ్ న్యూస్.. తిరుపతి నుంచి పళనికి స్పెషల్ బస్ సర్వీస్.. తక్కువకే
గుడ్ న్యూస్.. తిరుపతి నుంచి పళనికి స్పెషల్ బస్ సర్వీస్.. తక్కువకే
బజాజ్‌ పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బైక్‌పై భారీ డిస్కౌంట్‌!
బజాజ్‌ పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బైక్‌పై భారీ డిస్కౌంట్‌!
నిమ్మ తోట దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు.. ఆపి చెక్ చేయగా
నిమ్మ తోట దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు.. ఆపి చెక్ చేయగా
బావిలో పూడిక తీస్తుండగా ఘోరం.. 8మంది మృతి!
బావిలో పూడిక తీస్తుండగా ఘోరం.. 8మంది మృతి!
వెంకటేష్ అయ్యర్ ఊచకోత.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
వెంకటేష్ అయ్యర్ ఊచకోత.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
పుష్ప3లో విలన్లుగా విజయ్ దేవరకొండతో పాటు ఆ స్టార్ హీరో కూడా !
పుష్ప3లో విలన్లుగా విజయ్ దేవరకొండతో పాటు ఆ స్టార్ హీరో కూడా !
పరాయి స్త్రీ పై వ్యామోహమా గరుడ పురాణం ప్రకారం ఎటువంటి శిక్ష అంటే
పరాయి స్త్రీ పై వ్యామోహమా గరుడ పురాణం ప్రకారం ఎటువంటి శిక్ష అంటే