Janmashtami: అక్కడ పాలు, పాల ఉత్పత్తులు పూర్తిగా ఉచితం.. వాటిని అమ్మడం పాపంగా భావించే ప్రజలు.. ఎక్కడంటే.
ఇక్కడి ప్రజలు తమను తాము శ్రీకృష్ణుని వారసులమని భావిస్తారు. కనుక గ్రామస్తులు పాలు అమ్మడం పాపంగా భావిస్తారు. ఈ గ్రామంలో ఆవుకు ఉత్తమ స్థానం ఇవ్వబడింది.
Janmashtami: దేశ వ్యాప్తంగా జన్మాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున ప్రజలు కన్నయ్యకు పాలతో చేసిన తీపి వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అందువల్ల, మార్కెట్‌లో పాలకు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు చాలా పాల కంపెనీలు రేట్లు పెంచేశాయి అయితే పాలను, పాల పదార్ధాలతో వ్యాపారం చేస్తూ.. లక్షలు, కోట్లను ఆర్జిస్తున్నవారు ఎందరో ఉన్నారు. అయితే పాలకు ఎంత డిమాండ్ ఉన్నా మన దేశంలో ఒక ప్రాంతంలో పాలను, పాల పదార్ధాలను అమ్మరు. అంతేకాదు.. అవసరం అయిన వారికి ఉచితంగానే పాలు పోస్తారు.. మరి ఈరోజుల్లో కూడా ఇలా ఉచితంగా పాలు, పాల పదార్ధాలను ఇచ్చేవారున్నారా అని ఆలోచిస్తున్నారా.. ఇది నిజం.. ఆ గ్రామం మహారాష్ట్రలో ఉంది. వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు గావ్లీ. ఇక్కడ పాలు, పాలతో తయారు చేసిన ప్రతిదీ ఉచితంగా ఇస్తారు. అంటే పాల వ్యాపారం లేదా దానితో తయారు చేసిన వస్తువులతో వ్యాపారం చేయడం గావ్లీ వాసులు పాపంగా పరిగణిస్తారు. నీళ్లలో కూడా వ్యాపారం చేసే నేటి కాలంలో ఆ గ్రామంలో పాలు, పెరుగు, వెన్నె ఇలా వేటిని విక్రయించరు.
ఎందుకు ఉచితంగా ఇస్తారంటే: నిజానికి, ఇక్కడి ప్రజలు తమను తాము శ్రీకృష్ణుని వారసులమని భావిస్తారు. కనుక గ్రామస్తులు పాలు అమ్మడం పాపంగా భావిస్తారు. ఈ గ్రామంలో ఆవుకు ఉత్తమ స్థానం ఇవ్వబడింది. ఇక్కడ ఏ కుటుంబం కూడా ఆవు పాలు అమ్మదు. పాలతో తయారు చేసిన వస్తువులను అవసరమైన వారికి పూర్తిగా ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇక్కడి ప్రజలకు స్వచ్ఛమైన పాలు లభిస్తాయి. దీనివల్ల అన్ని వయసుల వారు ఇక్కడ ఆరోగ్యంగా ఉంటారు.
పాల వ్యాపారం చేయొద్దని శ్రీకృష్ణుడు చెప్పాడని గ్రామ ప్రజలు అంటున్నారు. ఈ సంప్రదాయాన్ని గ్రామస్థులు కొన్ని వందల ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. అందుకే ఇక్కడ పాలు అమ్మాలని ఎవరూ అనుకోరు. గ్రామంలోని పాలు, వాటితో చేసిన వస్తువులు పేదలందరికీ ఉచితంగా అందజేస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.
మరిన్నిహ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..