AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ కూరగాయలతో జర జాగ్రత్త..మంచిదని మరీ అలా తినేయకండి.. ఎందుకంటే..

ఏదానిని అతిగా తినటం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. అన్ని ఆహారపదార్థాలనుసమపాళ్లలో తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని చెబుతున్నారు.

Health Tips: ఈ కూరగాయలతో జర జాగ్రత్త..మంచిదని మరీ అలా తినేయకండి.. ఎందుకంటే..
Vegetables
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 19, 2022 | 1:09 PM

Vegetable Side Effects: మాంసాహారాలకంటే ఆకు కూరలు, కూరగాయలే ఆరోగ్యానికి మంచిదంటారు. కూరగాయల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయని, అందుకే ప్రతిరోజూ కావాల్సినన్ని కూరగాయలను ఆహారంలో తీసుకోవాలని ఇంతవరకు విన్నాం..కానీ, కొన్ని కూరగాయలతో ఆరోగ్యానికి ఎంత మేలుకలుగుతుందో..అంతే ప్రమాదం కూడా పొంచి ఉందంటున్నారు నిపుణులు. ఆ కూరగాయలెంటో ఇక్కడ తెలుసుకుందాం.

క్యారెట్లు: ముఖ్యంగా క్యారెట్లు కనిపించగానే..వెంటనే ఒకటి చేతిలో పట్టుకుని తుడుచుకుని అలాగే తినేయటం చాలా మందికి అలవాటు.. క్యారెట్లలో విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉండటంతో.. అది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అందుకే క్యారెట్‌ని వండుకుని తినడం కంటే.. పచ్చిగానే తినాలని డాక్టర్లు చెబుతుంటారు. ఆరోగ్యానికి మంచివే అయినా వీటిని ఎక్కువ మొత్తంలో తినడం ఏ మాత్రం మంచివి కాదంటున్నారు. ఎందుకంటే దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే కెరోటిన్ చర్మ రంగును పసుసు రంగులోకి మారుస్తుందని చెబుతున్నారు.

బీట్ రూట్: బీట్ రూట్‌లోనూ ఎన్నో పోషకాలుంటాయి. బీట్‌రూట్‌ని జ్యూస్ గా, సలాడ్ గా చేసుకుని తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది. అలాగని బీట్‌రూట్‌ కూడా ఎక్కువగా తినకూడదట… అలా తింటే మీ చర్మ రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారిపోతుందని చెబుతున్నారు. ఇది అంత ప్రమాదకరం కానప్పటికీ.. వీటిని మాత్రం మోతాదుకు మించి తినకపోవడమే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాలీఫ్లవర్: కాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన ఫుడ్. దీనిలో ఎన్నో ఔషదగుణాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ.. ఈ కూరగాయలను తింటే కొంతమందికి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. దీనిలో ఎన్నో రకాల పోషకాలున్నా.. ఇది జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే దీన్ని ఎప్పుడూ పచ్చిగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పుట్టగొడుగులు: పుట్టగొడుగులతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అధికమనే చెప్పాలి. దీనిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అయినప్పటికీ ఇవి కొందరికి పడవు. ముఖ్యంగా అలెర్జీ సమస్యతో బాధపడేవారు ఈ పుట్టగొడుగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి అలెర్జీ సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. అంతేకాదు దీన్ని తినడం వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయంటున్నారు నిపుణులు.

ఏది ఏమైనప్పటికీ, ఏదానిని అతిగా తినటం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. అన్ని ఆహారపదార్థాలనుసమపాళ్లలో తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని చెబుతున్నారు. ఎవైనా సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యలను సంప్రదించాలని చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి