Viral Video: ఖరీదైన లిక్కర్‌ కొడుతున్న కోతి.. ఆపై కారెక్కి రచ్చ రచ్చ చేసింది.. వీడియో చూస్తే అవాక్కే!

సీసా ఖాళీ అయిన కొంతసేపటి తరువాత..ఆ కోతులు సృష్టించిన సర్కాస్‌ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఇది చాలా అరుదైన వీడియో..

Viral Video: ఖరీదైన లిక్కర్‌ కొడుతున్న కోతి.. ఆపై కారెక్కి రచ్చ రచ్చ చేసింది.. వీడియో చూస్తే అవాక్కే!
Monkey
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 19, 2022 | 11:49 AM

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. మనం చూసే కొన్ని వీడియోలు మనం ఊహించలేని దృశ్యాలు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. కోతులకు సంబంధించిన వీడియో అది. ఇంటర్నెట్‌లో జంతువుల వీడియోలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇకపోతే, కోతుల వీడియోల గురించి ఇక చెప్పక్కర్లేదు..అయితే, కోతులకు మద్యం సీసాదొరికి చెట్టుపై కూర్చుని తాగడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. సీసా ఖాళీ అయిన కొంతసేపటి తరువాత..ఆ కోతులు సృష్టించిన సర్కాస్‌ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది అరుదైన దృశ్యం అనడంలో సందేహం లేదు. తాగిన తర్వాత కోతులు కారు నంబర్ ప్లేట్‌లను ధ్వంసం చేయడం కూడా చూడవచ్చు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో చెట్టుపై కూర్చొని కోతులు ఎలా మద్యం తాగుతున్నాయో చూడొచ్చు. తర్వాత రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలపై పడ్డాయి. మద్యం మత్తులో కళ్లు మూసుకుపోతున్నప్పటికీ ఆ కార్లపై పడి విధ్వంసం చేశాయి. కార్ల అద్దాలు,నెంబర్‌ ప్లేట్లను పీకిపారేసి నానా రచ్చ చేశాయి. మద్యం మత్తు తలెకెక్కింది అంటే ఇదేనేమో అన్నట్టుగా ప్రవర్తించాయి. వైరల్ వీడియోలో మనం చూసే కోతుల హంగామా మామూలుగా కనిపించేది కాదు. అసలే కోతులు.. ఆపై మందేసిన కోతులు..ఇక రచ్చ ఎలాంటో వీడియోలో చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

bhutni_ke_memes ద్వారా అప్‌లోడ్ చేయబడింది. అయితే, వైరల్‌ అవుతున్న ఈ వీడియో ఫేక్‌ వీడియోనీ కొన్ని వీడియోల్లోని క్లిప్పింగ్స్‌ తీసుకుని ఎడిటింగ్‌ చేశారంటున్నారు నెటిజన్లు. ఈ వీడియో ఉద్దేశపూర్వకంగానే క్రియేట్‌ చేశారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ, వీడియో మాత్రం చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది.

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

సోషల్ మీడియా అభిమానులు ఈ వీడియోపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తులు వీడియోను చాలా ఇష్టపడ్డారు. ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకు 24k వీక్షణలు మరియు చాలా లైక్‌లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి