Viral Video: కృష్ణుడి భక్తుడిగా మారిన పక్షి.. ‘హరే కృష్ణ’ అంటూ కన్నయ్య నామాన్ని జపిస్తున్న మైనా.. వీడియో వైరల్..

కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒక మైనా వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఈ పక్షి శ్రీకృష్ణుడిని కీర్తిస్తోంది.

Viral Video: కృష్ణుడి భక్తుడిగా మారిన పక్షి.. 'హరే కృష్ణ' అంటూ కన్నయ్య నామాన్ని జపిస్తున్న మైనా.. వీడియో వైరల్..
Bird Video Viral
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 20, 2022 | 1:53 PM

Viral Video:  శ్రీ కృష్ణుడు పుట్టిన రోజైన కృష్ణాష్టమి వేడుకలను దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గీతాలు, భజనలు ఆలపిస్తూ అర్ధరాత్రి నుంచి భక్తులు శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా జన్మాష్టమి శుభాకాంక్షలు చెబుతున్నారు.  ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒక మైనా వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఈ పక్షి శ్రీకృష్ణుడిని కీర్తిస్తోంది.

రామచిలుక, మైనా వంటి పక్షులు మనుషులను అనుసరిస్తాయి. చిలుక పలుకులు అని అందుకే అంటారు.. అయితే రామ చిలుక మాత్రమే కాదు.. మైనా అనే పక్షి కూడా మనిషిని అనుకరిస్తూ.. మాట్లాడుతుంది. మన చుట్టూ ఉన్నా మైనా మానవుడిలా మాట్లాడగలదని కొద్దిమందిమాత్రమే తెలియవచ్చు. ఈ నేపథ్యంలో మైనా పక్షికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లిప్‌లో, ‘హరే కృష్ణ, హరే కృష్ణ’ అంటూ ఒక వ్యక్తి  అని కృష్ణ నామాన్ని జపిస్తున్నాడు. ఆ తర్వాత అతడిని అనుసరిస్తూ.. పెంపుడు మైనా కూడా హరే కృష్ణ, హరే కృష్ణ అంటూ ముద్దు ముద్దుగా పునరావృతం చేయడం వీడియోలో చూడవచ్చు.

‘హరే కృష్ణ’ అని పఠించిన మైనా.. వీడియోను ఇక్కడ చూడండి

ఇవి కూడా చదవండి

గది నేలపై నిల్చుకున్న పక్షిని వీడియోలో చూడవచ్చు. ఒక వ్యక్తి తన వీడియో తీస్తూ.. అతను హరే కృష్ణ అంటున్నాడు. అతడిని అనుకరిస్తూ మైనా కూడా అందంగా ‘హరే కృష్ణ, హరే కృష్ణ’ అని చెప్పడం ప్రారంభించింది. తర్వాత ఆ వ్యక్తి పక్షి ముందు ‘హరి బోల్’ అంటాడు. వెంటనే మైనా తనదైన స్టైల్ లో హరి బోల్ ను రిపీట్ చేసింది.  ఈ వీడియో స్పిరిచువల్ యూనివర్స్ అనే ఛానెల్ నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లో షేర్ చేశారు. ‘హరే కృష్ణ, హరే కృష్ణ’ అని పక్షి పఠిస్తున్నట్లు క్యాప్షన్‌లో పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..