Viral: ఇది టాబ్లెట్ల అట్ట అనుకునేరు.. సరిగ్గా చూడండి వెడ్డింగ్ కార్డ్.. క్రియేటివిటీ అదుర్స్ కదా
తమిళనాడుకు చెందిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ తన పెళ్లికి పిలవడానికి ఓ ఇంటికెళ్లాడు. అవతలివారికి ఇతను ఫార్మసీ కాలేజీలో అధ్యాపకుడని అని తెలుసు.. ఇంటికెళ్లి ఓ టాబ్లెట్ షీట్ తీసి ఇచ్చాడు. అది అందుకున్న వారు ఇదేంటి బాబు అని అడగ్గా..
ఒక్కోక్కరిది ఓక్కో ఆలోచన.. ఏం చేసినా వెరైటీ.. సమథింగ్ స్పెషల్ గా ఉండాలనేది నేటి యూత్ ఆలోచన. మనం చేసేది భిన్నంగా ఉంటే అదో హ్యాపీ.. పెళ్లి అంటే అందరికీ జీవితంలో మరపురాని క్షణం.. జీవితాంతం గుర్తుండుపోయే జ్ఞాపకం.. నాపెళ్లి అలా జరిగింది. ఇలా చేశాం అని ఎప్పటికి గొప్పుల చెప్పుకుంటుంటాం.. పెళ్లికి పిలవడానికి కొట్టించే వెడ్డింగ్ కార్డు కూడా ఓ స్పెషలే. అందుకే వెరైటీ వెరైటీగా శుభలేఖలు కొట్టిస్తాం.. కాని తమిళనాడుకు చెందిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ తన పెళ్లికి పిలవడానికి ఓ ఇంటికెళ్లాడు. అవతలివారికి ఇతను ఫార్మసీ కాలేజీలో అధ్యాపకుడని అని తెలుసు.. ఇంటికెళ్లి ఓ టాబ్లెట్ షీట్ తీసి ఇచ్చాడు. అది అందుకున్న వారు ఇదేంటి బాబు అని అడగ్గా.. ఇది తన పెళ్లి శుభలేఖ అని చెప్పడంతో అవతలి వారికి దిమ్మతిరిగింది. ఒకటికి రెండు సార్లు చూస్తే కాని తెలియలేదు అది శుభలేఖని.
వృత్తిరీత్యా ఫార్మసీ రంగానికి చెందిన తిరువణ్ణామలైకి చెందిన ఎళిలరసన్ సెప్టెంబర్ 5వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నాడు. దీనికోసం టాబ్లెట్ సీట్ రూపంలో తన వెడ్డింగ్ కార్డుని కొట్టించాడు. టాబ్లెట్ పేరుండే చోట ఎళిలరసన్, వసంతకుమారిల విహహం అంటూ ప్రింట్ చేయించాడు. Expire Date ఉన్న చోట పెళ్లి తేదీ, విందు సమయం, రిసప్షన్ ఎప్పుడో ముద్రించాడు. ఇంకా పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెల విద్యార్హతలు, వారు చేసే పని.. ఇలా అన్ని రకాల వివరాలను ఈటాబ్లెట్ కార్డులో ముద్రించి పంచడం మొదలు పెట్టాడు. అంతే కాదు. ఈచిన్న టాబ్లెట్ కార్డులో తన వివాహం రోజునే ఉన్న ప్రముఖ అకేషన్లను పేర్కొన్నాడు.స్పెషల్ డేస్ అంటూ ఆరోజు టీచర్స్ డే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు, మదర్ థెరిస్సా మెమోరియల్ డే అని కార్డుపై ప్రచురించాడు. టాబ్లెట్ షీట్ పై అదెక్కడ తయారైందో ఇస్తారు. అలాగే మ్యానుఫ్యాక్చర్ బై అనే చోట ఆ శుభలేఖ ఎక్కడ ప్రింట్ అయిందో దాని అడ్రస్ ను కూడా ప్రింట్ చేయించాడు. ఇప్పడు ఈకార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈకార్డు చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..