AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తప్పని పరిస్థితుల్లో నగ్న వీడియో కాల్ మాట్లాడిన మహిళ.. స్క్రీన్‌ రికార్డర్‌‌తో రికార్డ్ చేసి..

మచిలీపట్నంలో జరిగిన ఓ మహిళకు జరిగిన ఘటనతో దిశ పోలీసులు అలర్ట్ అయ్యారు. మహిళలకు పలు సూచనలు చేశారు. తెలిసిన వాళ్లే కదాని న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడితే చిక్కుల్లో పడతారని హెచ్చరించారు.

Andhra Pradesh: తప్పని పరిస్థితుల్లో నగ్న వీడియో కాల్ మాట్లాడిన మహిళ..  స్క్రీన్‌ రికార్డర్‌‌తో రికార్డ్ చేసి..
Harassment
Ram Naramaneni
|

Updated on: Aug 19, 2022 | 6:57 AM

Share

AP Crime News: ఓ మహిళను న్యూడ్ వీడియోలతో వేధిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు మచిలీపట్నం(Machilipatnam) దిశ పోలీసులు. రాజమండ్రికి(Rajahmundry) చెందిన ఓ ఒంటరి మహిళ బొటిక్ షాప్ నిర్వహిస్తుంది. వ్యాపార అవసరాల కోసం ఫైనాన్స్ వ్యాపారైనా తన ఫ్రెండ్ ను ఆశ్రయించింది. ఇదే అదునుగా భావించిన వ్యాపారి హన్స్ రాజ్ తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. న్యూడ్ వీడియో కాల్ చేస్తే ఇస్తానంటూ, వడ్డీ తగ్గిస్తానంటూ ఆమెను పదేపదే హింసించాడు. తప్పని పరిస్థితుల్లో న్యూడ్ వీడియో చాట్ చేసింది ఆమహిళ. న్యూడ్ వీడియోలను స్క్రీన్ రికార్డర్ ద్వారా హన్స్ రాజ్ రికార్డు చేసుకున్నాడు. ఒక రోజు తన ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందని తన ఫ్రెండ్ రామినేని సాయి చంద్ వద్దకు వెళ్లాడు హన్స్ రాజ్. ఫోన్ లో న్యూడ్ వీడియోలను గమనించిన సాయి చంద్.. హన్స్ రాజ్ ఫోన్ లోని న్యూడ్ వీడియోలను తన ల్యాప్ టాప్ లో సేవ్ చేసుకున్నాడు. ఆ మహిళను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె న్యూడ్ వీడియోలను ఫోర్న్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధిత మహిళ మచిలీపట్నం దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిశ పోలీసులు మహిళ ఫిర్యాదును స్వీకరించి నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు.. వారి దగ్గర ఉన్న ఫోన్స్, ల్యాప్ టాప్, ఐపాడ్ స్వాధీనం చేసుకున్నట్లు దిశ డీఎస్పీ రాజీవ్ కుమార్ చెప్పారు.

ఇదే క్రమంలో మహిళలకు పలు సూచనలు చేశారు మచిలీపట్నం దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజీవ్ కుమార్. ఎవరైనా న్యూడ్ కాల్ చేయమని వేధిస్తే.. వెంటనే దిశ ఎస్ఓఎస్ బటన్ నొక్కితే ఇమిడియట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మహిళలకు, ఆడపిల్లలు దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకొని.. ఎలాంటి అసౌకర్యం జరిగిన వెంటనే ఎస్ఓఎస్ బటన్ నొక్కి పిర్యాదు చేయాలిని చెప్పారు డీఎస్పీ రాజీవ్ కుమార్.

మరిన్ని నేర వార్తల కోసం చూడండి..