AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలకు కేంద్రం షాక్.. ఎక్స్ఛేంజీల్లో విద్యుత్ కొనకుండా నిషేధం.. నేటినుంచి కోతలు తప్పవా?

Power Crisis: విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు పంపిణీ సంస్థలకు భారీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. లిస్టులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ఉన్నాయి.

తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలకు కేంద్రం షాక్.. ఎక్స్ఛేంజీల్లో విద్యుత్ కొనకుండా నిషేధం.. నేటినుంచి కోతలు తప్పవా?
Power Supply Wires
Venkata Chari
|

Updated on: Aug 19, 2022 | 7:06 AM

Share

Power Crisis: 13 రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుంది. రాష్ట్రాలన్నీ భారీ బకాయిలు పడ్డాయని, చెల్లించకపోతే విద్యుత్ సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (POSOCO) 13 రాష్ట్రాల్లోని 27 పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పవర్ ట్రేడింగ్‌ను నిషేధించాలని మూడు పవర్ ఎక్స్ఛేంజీలు అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్, పవర్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ పవర్ ఎక్స్ఛేంజ్‌లను కోరింది.

ఈ పంపిణీ సంస్థలకు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి భారీ బకాయిలు ఉన్నాయి. లిస్టులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి.

విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని POSOCO దేశంలో విద్యుత్ వ్యవస్థ సమగ్ర కార్యాచరణను నిర్వహిస్తుంది. ఈ మేరకు మూడు పవర్ మార్కెట్‌లకు రాసిన లేఖలో, “13 రాష్ట్రాల్లోని 27 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అన్ని విద్యుత్ మార్కెట్ ఉత్పత్తులను కొనడం-అమ్మడం/డెలివరీ చేయడం 2022 ఆగస్టు 19 నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు ఖచ్చితంగా నిషేధించాలి” అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

చెల్లింపు భద్రతా వ్యవస్థ కింద, ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థలను ఉత్పత్తి చేసే కంపెనీలకు బకాయిలు చెల్లించనందుకు విద్యుత్ మార్కెట్‌లో వ్యాపారం చేయకుండా నిషేధించవచ్చు. దీని కింద, తగినంత చెల్లింపులు చేస్తే లేదా ముందస్తు చెల్లింపు చేస్తేనే విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలుస్తుంది. లేదంటే మాత్రం ఈ రాష్ట్రాల్లో చీకట్లు కమ్ముకోనున్నట్లు తెలుస్తోంది.

కట్టాల్సిన బాకీలు..

తెలంగాణ రూ. 1380 కోట్లు, తమిళనాడు రూ. 924 కోట్లు రాజస్థాన్ రూ. 500 కోట్లు, జమ్మూ కాశ్మీర్ రూ. 434 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 412 కోట్లు, మహారాష్ట్ర రూ. 381 కోట్లు, చత్తీస్ఘడ్ రూ. 274కోట్లు, మధ్యప్రదేశ్ రూ. 230 కోట్లు, ఝార్ఖండ్ రూ. 214 కోట్లు, బీహార్ రూ. 172 కోట్లుగా తేలింది. అయితే, తెలంగాణను ఇబ్బంది పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుందంటూ తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆరోపణలు కురిపిస్తున్నాయి. తెలంగాణ విద్యుత్ బకాయిల విషయం హైకోర్టులో ఉందంటూ చెప్పుకొచ్చాయి.

అర్ధరాత్రి వరకు అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా, వర్షాకాలం కావడంతో విద్యుత్ పెద్దగా డిమాండ్ లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రేపు కూడా పూర్తిస్థాయిలో విద్యుత్ కొనుగోల నిషేధిస్తే గ్రిడ్ కుప్పకూలిపోయే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో సర్వత్రా ఆందోళనలు మొదలయ్యాయి. కొత్త విద్యుత్ పథకంలో చేరితే విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తామని సెంట్రల్ సర్కార్ పేర్కొన్నట్లు రాష్ట్రాలు చెబుతున్నా.. అందులో చేరేందుకు కొన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విపత్కర పరిస్థితులు సృష్టిస్తుందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!