AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: బ్యాంక్‌ దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్‌.. దొంగలతో చేతులు కలిపిన ఇన్స్పెక్టర్.. కట్ చేస్తే

పోలీసులు అంటే ప్రజలకు రక్షణ కల్పించాలి. వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి. సమాజంలో జరిగే నేరాలను అరికట్టాలి. నిందితులను పట్టుకుని చట్టపరంగా శిక్షలు పడే విధంగా చేయాలి. కానీ ఓ పోలీసు అధికారి మాత్రం తన విధి కర్తవ్యాన్ని మరిచాడు...

Tamil Nadu: బ్యాంక్‌ దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్‌.. దొంగలతో చేతులు కలిపిన ఇన్స్పెక్టర్.. కట్ చేస్తే
Bank Robbery Case
Ganesh Mudavath
|

Updated on: Aug 19, 2022 | 7:40 AM

Share

పోలీసులు అంటే ప్రజలకు రక్షణ కల్పించాలి. వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి. సమాజంలో జరిగే నేరాలను అరికట్టాలి. నిందితులను పట్టుకుని చట్టపరంగా శిక్షలు పడే విధంగా చేయాలి. కానీ ఓ పోలీసు అధికారి మాత్రం తన విధి కర్తవ్యాన్ని మరిచాడు. దొంగలతో చేతులు కలిపాడు. పక్కా ప్లాన్ తో బ్యాంక్ దోపిడీకి పాల్పడ్డాడు. సిబ్బందికి కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి ఏకంగా 32 కిలోల బంగారం కొట్టేశాడు. నిందితులను విచారిస్తున్న సమయంలో ఈ కీలక సమాచారం వెల్లడైంది. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర రాజధాని చెన్నై లోని ఫెడరల్ బ్యాంకులో నగల దోపిడీ (Bank Robbery) కేసు సంచలనంగా మారింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. ఈ కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. ఓ పోలీసు అధికారే దొంగలతో చేతులు కలిపి ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలిసి అవాక్కయ్యారు. 32 కిలోల బంగారం దోపిడీ లో ఇన్స్పెక్టర్ అమల్‌రాజ్‌ మాస్టర్ మైండ్ గా పనిచేశాడు. పక్కా ప్లాన్‌తో బ్యాంక్‌ దోపిడీ చేశాడు. బ్యాంకు దోపిడీకి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో దొంగల నుంచి ఈ విషయాలు తెలుసుకున్నాుర. ఇన్స్‌పెక్టర్‌ బాగోతాన్ని దొంగలు బయటపెట్టారు. వారు చెప్పిన ఆధారాలతో ఆయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులు కిలో బంగారాన్ని గుర్తించారు.

కాగా.. ఈ నెల 13 న చెన్నై అరుంబాక్కం లోని ఫెడరల్ బ్యాంకు లో భారీ దోపిడీ జరిగింది. సిబ్బందికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి ఏడుగురు దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. దోపిడీకి పాల్పడిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్ద నుంచి 18 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన ముఠాను విచారిస్తున్న సమయంలో విస్తుపోయే నిజాలు గుర్తించారు. ఇన్స్‌పెక్టర్‌ అమల్రాజ్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఫెడరల్ బ్యాంక్ దొంగతనానికి సంబంధించిన పూర్తి బంగారాన్ని రెండు మూడు రోజుల్లోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని నేర వార్తల కోసం చూడండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?