Healthy Foods: హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ పదార్థాలను చేర్చండి..

Best Food For Heart: మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే విధంగా, ఎల్‌డిఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ తగ్గే విధంగా ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తుంటారు. ఒమేగా 3, ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్, రిచ్ విటమిన్లు, ఫైటోకెమికల్‌లు సమృద్ధిగా ఉండేలా..

Healthy Foods:  హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ పదార్థాలను చేర్చండి..
Heart Health
Follow us
Venkata Chari

|

Updated on: Aug 18, 2022 | 8:07 AM

Best Food For Heart: ఆరోగ్యకరమైన గుండె కోసం, కొలెస్ట్రాల్‌ను సక్రమంగా ఉంచుకోవడం చాలా మంచిది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే విధంగా, ఎల్‌డిఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ తగ్గే విధంగా ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తుంటారు. ఒమేగా 3, ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్, రిచ్ విటమిన్లు, ఫైటోకెమికల్‌లు సమృద్ధిగా ఉండేలా మీ ఆహార అలవాటును మార్చుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. అలాంటి ఆహారం ఎందులో లభిస్తుందో ఇప్పుడు చూద్దాం..

1. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్- ఒమేగా 3 మంచి కొవ్వు రకం. ఇది చేపలు, అవిసె గింజలలో ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 సోయాబీన్, దాని నూనెలో అలాగే కనోలా నూనెలో కనిపిస్తుంది. మన గుండెతో పాటు, ఒమేగా 3 ఊపిరితిత్తులను కూడా సరిగ్గా ఉంచుతుంది.

2. ఫైబర్- ఫైబర్ మన శరీరం నుంచి LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) ను తగ్గిస్తుంది. ఎల్‌డీఎల్‌ను చెడు కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. ఇది ఆరోగ్యకరమైన గుండె కోసం పెరగకూడదు. ఫైబర్ కోసం, ఊక లేదా బహుళ ధాన్యపు పిండితో చేసిన బ్రెడ్ తినాలి. పప్పులు, పెయిర్ ఫ్రూట్, చియా గింజలు, బాదంలో సమృద్ధిగా ఫైబర్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

3. యాంటీ-ఆక్సిడెంట్లు – స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి అన్ని రకాల బెర్రీలు యాంటీ-ఆక్సిడెంట్స్ ఉన్న పండ్లు. ఆరెంజ్ ద్రాక్ష, కాఫీ, డార్క్ చాక్లెట్, క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో, బచ్చలికూరలో కూడా పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

4. విటమిన్లు- విటమిన్ B కోసం, పాల ఉత్పత్తులు, జున్ను తినాలి. విటమిన్ ఏ బచ్చలికూర, క్యారెట్లు, చిలగడదుంపలలో లభిస్తుంది. విటమిన్ సి నారింజ, నిమ్మకాయలు, సీజనల్ వంటి సిట్రస్ పండ్లలో లభిస్తుంది. విటమిన్ డి పాలు, తృణధాన్యాలు, చేపలలో లభిస్తుంది. విటమిన్ E తృణధాన్యాలు, ఆకు కూరలు, డ్రై ఫ్రూట్స్‌లో లభిస్తుంది.

5. ఫైటోకెమికల్ – ఇది పండ్లు, కూరగాయలలో కనిపించే రసాయన సమ్మేళనం. సరళంగా చెప్పాలంటే, మనం ఆహారంలో రంగురంగుల కూరగాయలు, పండ్లు తినాలి. ఎరుపు, పసుపు క్యాప్సికమ్, బ్రోకలీ, బీట్‌రూట్, వంకాయ, క్యారెట్ అన్నీ ఆహారంలో చేర్చుకోవాలి. రంగురంగుల కూరగాయలు, పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దెబ్బతిన్న కణాలను సరిచేస్తుంది. ఇది క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సమాచారం కోసమే అని గుర్తించాలి. వీటిని సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం తీసుకునే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం