15 బంతుల్లో 13 డాట్స్.. 8 పరుగులిచ్చి 3 వికెట్లు.. ఇదేం బౌలింగ్‌రా సామి.. ఆ డేంజరెస్ ప్లేయర్ ఎవరంటే?

వెల్స్ ఫైర్‌ జట్టుకు వ్యతిరేకంగా అబాట్ 15 బంతులు సందించాడు. అందులో అతను 13 బంతుల్లో ఎటువంటి పరుగులు ఇవ్వలేదు. కేవలం 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

15 బంతుల్లో 13 డాట్స్.. 8 పరుగులిచ్చి 3 వికెట్లు.. ఇదేం బౌలింగ్‌రా సామి.. ఆ డేంజరెస్ ప్లేయర్ ఎవరంటే?
Sean Abbott
Follow us
Venkata Chari

|

Updated on: Aug 17, 2022 | 12:52 PM

క్రికెట్ ఎంత ఉత్కంఠభరితంగానో, అంతే ఆహ్లాదంగానూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంలా కూడా మారుతుంది. క్రికెట్ మైదానంలో దీనికి ఉదాహరణలు చాలాసార్లు కనిపిస్తాయి. 2014 నాటి ఓ సంఘటనను గుర్తు చేసుకుంటే మాత్రం.. గూస్‌బంప్స్ నిలుస్తాయి. ఆ బాధాకరమైన సంఘటన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఫిల్ హ్యూస్ మరణానికి సంబంధించినది. ఆస్ట్రేలియాలో జరిగిన దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లో ఫిల్ హ్యూస్ అబాట్ డేంజర్ పేస్‌కు బలయ్యాడు. అదే సమయంలో ఒక బంతి అతని హెల్మెట్ వెనుకకు తగిలి, హ్యూస్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఆ సంఘటన నుంచి కోలుకోవడానికి, క్రికెట్‌లో ఉంటూ తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి అబాట్‌కు చాలా సమయం పట్టింది.

ఇప్పుడు క్రికెట్ మైదానంలో అబాట్ బంతులు మరోసారి రెచ్చిపోయాయి. దీనికి ఇటీవలి సాక్ష్యం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న 100 బంతుల టోర్నమెంట్ ది హండ్రెడ్‌లో కనిపించింది. వెల్స్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ తరపున ఆడిన అబాట్ ప్రతి 5 బంతుల్లో సగటున ఒక బ్యాట్స్‌మన్ వికెట్ పడగొట్టాడు.

15 బంతులు, 13 డాట్స్, 8 పరుగులు, 3 వికెట్లు..

ఇవి కూడా చదవండి

వెల్స్ ఫైర్‌కి వ్యతిరేకంగా అబాట్ 15 బంతులు సందించాడు. అందులో అతను 13 బంతుల్లో ఎటువంటి పరుగులు ఇవ్వలేదు. కేవలం 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇప్పుడు 15 బంతుల్లో సగటున 3 వికెట్లు తీస్తే, ప్రతి 5 బంతుల్లో 1 వికెట్ పడగొట్టినట్లు. ఈ బలమైన ప్రదర్శనకు అబాట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.

ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ 100 బంతుల్లో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. మాంచెస్టర్ ఒరిజినల్స్ తరపున వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్ బ్యాట్‌తో అత్యధికంగా 38 పరుగులు చేశాడు.

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..