- Telugu News Photo Gallery Spiritual photos chanakya niti in telugu: according to acharya chanakya intelligent people have these habits
Chanakya Niti: తెలివైన వ్యక్తులకు ఈ అలవాట్లు ఉంటాయి.. విజయం వీరి సొంతం అంటున్న చాణక్య
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో తెలివైన వ్యక్తుల అలవాట్ల గురించి కూడా ప్రస్తావించాడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, మీరు ఈ అలవాట్ల ద్వారా తెలివైన వ్యక్తులను గుర్తించవచ్చు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.
Updated on: Aug 19, 2022 | 11:31 AM

మత్తు వంటి అలవాటుకు యువత దూరంగా ఉండాలి. మత్తు కారణంగా మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనుడవుతాడు. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యసనాలు యువత వర్తమానాన్ని, భవిష్యత్తును పాడుచేస్తాయి.

ఆచార్య చాణక్యుడు ప్రకారం, యుక్తవయస్సులో.. యువతీయువకులు భవిష్యత్తు గురించి అప్రమత్తంగా ఉండాలి. సరైన వ్యూహాన్ని రూపొందించడం ద్వారా, యువత తమ జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు. అయితే వారు చెడు అలవాట్లకు బానిసగా మారితే అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యువతీయువకులు ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం

కొంగ - కొంగకు తన ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో తెలుసు. అదే విధంగా సంయమనంతో పని చేస్తే విజయం సులువుగా దొరుకుతుంది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కాబట్టి మీ మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఏకాగ్రతతో పని చేయండి.

డేగ తన లక్ష్యాన్ని సాధించడంలో ఎప్పుడూ విఫలం కాదు. ఎవరూ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా అడుగులు వేయాలి. జాగ్రత్తగా ఆలోచించి సమయం తీసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఎల్లప్పుడూ లక్ష్యం చేరుకోవాలి.

చాలా సార్లు.. ఎంత కష్టపడి పని చేసినా ఏ పనిలోనూ విజయం సాధించలేము. పని ఒత్తిడి ఉంటే.. మనకు ఇష్టమైన వారిని కూడా దూరంగా ఉంచుతాం. అయితే ఎంత కష్టపడినా జీవితంలో మనం ఏమీ సాధించలేకపోతున్నాం అనుకునేవారు ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. కొన్ని జంతువుల లక్షణాల నుంచి నేర్చుకోవడం ద్వారా.. వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు.





























