- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in telugu: if you want to test any person then you should notice these things
Chanakya Niti: మీకు అయినవారో కాదో తెలుసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయంటున్న ఆచార్య చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్య తక్షశిలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆయన మంచి నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, వ్యూహకర్త, ఆర్థికవేత్త, దౌత్యవేత్త. ఆయన అనేక గ్రంథాలను రచించారు. అందులో చాణక్య నీతి ఒకటి. చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఈ విధానాలు నేటికీ అనుసరణీయం.
Updated on: Aug 18, 2022 | 12:31 PM

స్త్రీలు, పురుషులు తమ భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారనేది నిజం. అయితే చాలా మంది మహిళలు పురుషుల వ్యక్తిత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే.. అతని గొప్ప గుణమని నిరూపించవచ్చు. స్త్రీలు అత్యాశ లేదా అహంకార ధోరణులను కలిగి ఉన్న పురుషుల నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. మహిళలు నిజాయితీగా, విధేయతతో ఉన్నవారిని ఇష్టపడతారు. అటువంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు.

సందేహం: ఒకరినొకరు ఎప్పుడూ అనుమానించుకోకండి. సంబంధంలో సందేహాలు ఉంటే ఆ సంబంధాన్ని నాశనం చేయవచ్చు.కనుక మీ భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకండి. మీ భాగస్వామి గురించి మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే.. వెంటనే మీ భాగస్వామిని అడగడం ద్వారా ఆ అనుమానాన్ని ఆలోచనను దూరం చేసుకోండి.

దొంగిలించబడిన డబ్బు - దొంగతనం చేసి.. సంపాదించిన డబ్బు లేదా తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బులు వ్యక్తి వద్ద ఎక్కువ కాలం ఉండదు. అలాంటి సంపాదనకు విలువ ఉండదు.. అటువంటి వ్యక్తిని ఎవరూ గౌరవంగా చూడరు. కనుక దొంగతనం చేసి డబ్బు సంపాదించకండి.

అసూయ: కోపంలా అసూయ కూడా మనిషికి అతి పెద్ద శత్రువు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అసూయ మనిషిని ముందుకు సాగనివ్వదు. అసూయపడే వ్యక్తి ఎప్పుడూ తనతో పాటు, ఇతరుల విజయానికి కూడా అడ్డుగా ఉంటాడు.

ఎవరైనా మీ లోపాలను పదే పదే బయటపెట్టి మిమ్మల్ని తగ్గించాలనుకుని కోరుకుంటే, అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తిని ఉన్నతంగా చూపించండి. దీనితో మీరు అతన్ని ఎక్కువగా చేసి చూపిస్తూ.. అతడిని తక్కువ చేసి చూపించవచ్చు. దీని వల్ల ఎదుటి వ్యక్తి మీలో తప్పులు కనిపెట్టాలని చాలాసార్లు ఆలోచిస్తారు.





























