AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆంటీల మజాకా..! అబ్బాయితో కలిసి అదిరిపోయే డ్యాన్స్‌ చేశారు.. వీడియో చూస్తే విజిల్‌ వేయాల్సిందే..!

జీవితంలో ఒకేసారి జరుపుకునే పెళ్లి తంతు మహోత్సవాన్ని కొత్తకొత్త స్టైల్లో జరుపుకుంటున్నారు. ప్రతి మూవ్‌మెంట్‌ని ఎంతో అందంగా, జీవితకాలం గుర్తుండిపోయేలా నిర్వహించుకుంటున్నారు.

Viral Video: ఆంటీల మజాకా..! అబ్బాయితో కలిసి అదిరిపోయే డ్యాన్స్‌ చేశారు.. వీడియో చూస్తే విజిల్‌ వేయాల్సిందే..!
Wedding Hall
Jyothi Gadda
|

Updated on: Aug 19, 2022 | 12:38 PM

Share

Viral Video: ఇటీవలి కాలంలో పెళ్లిళ్లకు సంబంధించి అనేక వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎంగేజ్‌మెంట్ మొదలు.. అప్పగింతల వరకు అన్ని సందర్భాలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు నేటి తరం యువతీ యువకులు. జీవితంలో ఒకేసారి జరుపుకునే పెళ్లి తంతు మహోత్సవాన్ని కొత్తకొత్త స్టైల్లో జరుపుకుంటున్నారు. ప్రతి మూవ్‌మెంట్‌ని ఎంతో అందంగా, జీవితకాలం గుర్తుండిపోయేలా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అలాంటి ప్రతి సన్నివేశానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ ఇంటర్ నెట్‌ ప్రపంచాన్ని సైతం ఆకర్షిస్తున్నారు. అలాంటి పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా నెట్టింట చేరి హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో వధూవరులకు బదులుగా పెళ్లికి వచ్చిన అతిథులు హంగామా క్రియేట్‌ చేశారు. ఆ సందడి అంతా ఇంతా కాదు..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో మొదటగా ఓ అబ్బాయి వేదికపైకి వచ్చి డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఇద్దరు ఆడవాళ్లు కూడా అతడితో కలిసి కలిసి స్టెప్పులేశారు. ‘మైన్ నై నవేలీ ఆయ్’ పాటకు ఆ ముగ్గురు కలిసి డ్యాన్స్‌ ఇరగదీశారు. అబ్బాయి ఫార్మల్ ప్యాంట్-షర్టు ధరించి కనిపిస్తుండగా, మహిళలు సంప్రదాయ చీరల్లో డ్యాన్స్‌తో అదరగొట్టారు.

ఇవి కూడా చదవండి

ఓ మహిళ డ్యాన్స్ మధ్యలో వెళ్లి మళ్లి వస్తుంది. వీడియో చివర్లో మరో మహిళ కూడా వీరితో కలిసి డ్యాన్స్ చేస్తారు. అంకిత్ జాంగిద్ అనే ఖాతా ద్వారా యూట్యూబ్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు యూట్యూబ్‌లో 44 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. డ్యాన్స్‌ని చూసి అక్కడున్న జనం కూడా చప్పట్లు, కేరింతలతో హోరెత్తించారు. ఇక నెటిజన్లు లైకులు, కామెంట్లతో నెట్టింట వీడియో రచ్చ రచ్చ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల