Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video:36 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్‌.. దెబ్బకు బ్యాటర్‌ బిత్తర చూపులు

England vs South Africa: కైల్‌ వెరిన్నేను ఔట్‌ చేయడం ద్వారా లార్డ్స్‌లో 100వ వికెట్‌ అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత అందుకున్న రెండో ఇంగ్లండ్‌ బౌలర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. జేమ్స్‌ అండర్సన్‌(117 వికెట్లు) మొదటి స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌ సంగతి పక్కన పెడితే..

Viral Video:36 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్‌.. దెబ్బకు బ్యాటర్‌ బిత్తర చూపులు
Stuart Broad
Follow us
Basha Shek

|

Updated on: Aug 19, 2022 | 7:22 PM

England vs South Africa: ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య చారిత్రాత్మకమైన లార్డ్స్ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై సఫారీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 165 పరుగులకే కుప్పకూల్చిన ప్రొటీస్‌.. బ్యాటింగ్‌లోనూ రాణించింది. మొదటి ఇన్నింగ్స్‌ లో 326 రన్స్‌ చేసి 161 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈటెస్టులో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఒక మైలురాయిని చేరుకున్నాడు. కైల్‌ వెరిన్నేను ఔట్‌ చేయడం ద్వారా లార్డ్స్‌లో 100వ వికెట్‌ అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత అందుకున్న రెండో ఇంగ్లండ్‌ బౌలర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. జేమ్స్‌ అండర్సన్‌(117 వికెట్లు) మొదటి స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌ సంగతి పక్కన పెడితే బ్రాడ్‌ పట్టిన ఓ క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

మాథ్యూ పాట్స్ వేసిన 78వ ఓవర్‌లో రబాడ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు బ్రాడ్. పాట్స్‌ వేసిన షార్ట్‌ బాల్‌ను ఫుల్‌షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించిన రబాడ.. బంతిని సరిగ్గా టైం చేయలేకపోయాడు. దీంతో బంతి గాల్లోకి లేచింది. అదే సమయంలో లాంగ్‌ ఆన్‌లో నిలబడి ఉన్న బ్రాడ్‌ గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ సమయంలో అతను కింద పడిపోయినా బంతిని మాత్రం నేలకు తాకనివ్వలేదు. 36 ఏళ్ల వయసున్న బ్రాడ్‌ ఈ క్యాచ్‌ అందుకోవడం చూసి రబాడ ఆశ్చర్యపోయాడు. ఇక ఇంగ్లండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్రాడ్‌ దగ్గరికొచ్చి సంతోషంతో అతనిని హత్తుకున్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లండ్‌ తీరు మారలేదు. వరుసగా వికెట్లు కోల్పోతుంది. ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసి ఎదురీదుతోంది. ఆ జట్టు ఇంకా 75 పరుగులు వెనకబడి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..