Gautam Gambhir: గౌతీ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ క్రికెట్‌ మైదానంలోకి అడుగుపెట్టనున్న ఎంపీ

LLC 2022: ఓ క్రికెటర్‌గా భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir). 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ లో అతను ఆడిన ఇన్నింగ్స్‌లు ఎవరూ మర్చిపోలేరు.

Gautam Gambhir: గౌతీ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ క్రికెట్‌ మైదానంలోకి అడుగుపెట్టనున్న ఎంపీ
Gautam Gambhir
Follow us
Basha Shek

|

Updated on: Aug 19, 2022 | 8:06 PM

LLC 2022: ఓ క్రికెటర్‌గా భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir). 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ లో అతను ఆడిన ఇన్నింగ్స్‌లు ఎవరూ మర్చిపోలేరు. ఇక సారథిగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను రెండుసార్లు విజేతగా నిలిపిన ఘనత ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ సొంతం. ఇలా భారత క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న గౌతీ 2018లో అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి రిటైర్‌ అయ్యాడు. ఆతర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాడు. ఇదిలా ఉంటే ఈ సొగసరి ఆటగాడు మరోసారి క్రికెట్‌ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. భారత జట్టు మాజీ కోచ్‌ రవిశాస్త్రి కమిషనర్‌గా వ్యవహరిస్తోన్న లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ రెండో సీజన్‌లో అతను భాగం కానున్నాడు. ఈ విషయాన్ని గంభీర్‌ శుక్రవారం ధ్రువీకరించాడు.’మళ్లీ క్రికెట్‌ మైదానంలో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాళ్లతో ఆడే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని గౌతీ పేర్కొన్నాడు.

కాగా లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌-2022 సీజన్‌ సెప్టెంబరు 17 నుంచి ప్రారంభం కానుంది. దిగ్గజ ఆటగాళ్లతో కూడిన మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఇదిలా ఉంటే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఇండియా మహరాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య సెప్టెంబర్ 16న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఓ ఛారిటీ మ్యాచ్‌ జరగనుంది. ఇండియా మహరాజాస్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సారథ్యం వహిస్తుండగా.. వరల్డ్‌ జెయింట్స్‌కు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ నాయకత్వం వహించనున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్