Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: పంజాబ్ కింగ్స్ కోచ్ పదవి నుంచి కన్నడిగ అనిల్ కుంబ్లే ఔట్..? కొత్త కోచ్‌గా..

IPL 2023, Anil Kumble: ఐపీఎల్ టోర్నమెంట్ 15వ ఎడిషన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు తన జట్టులో ఓ బిగ్ ఆపరేషన్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆ జట్టు కన్నడిగుల ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేను..

IPL 2023: పంజాబ్ కింగ్స్ కోచ్ పదవి నుంచి కన్నడిగ అనిల్ కుంబ్లే ఔట్..? కొత్త కోచ్‌గా..
Anil Kumble And Eoin Morgan
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 19, 2022 | 6:17 PM

టాప్‌లో దూసుకుపోయేందుకు పంజాబ్ కింగ్స్ ప్లాన్ చేస్తోందా..? ఈసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకుపోయేందుకు ప్లాన్ చేస్తుందా..? అలానే అనిపిస్తోంది. బలమైన ఆటగాళ్లతో కూడిన జట్టు ఉన్నప్పటికీ.. పంజాబ్ కింగ్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ గత ఎడిషన్‌లో కేవలం 2 పాయింట్ల తేడాతో ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. ఇప్పుడు ఐపీఎల్ టోర్నమెంట్ 15వ ఎడిషన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు తన జట్టులో ఓ బిగ్ ఆపరేషన్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆ జట్టు కన్నడిగుల ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేను జట్టు నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ రాబోయే సీజన్‌లో కొత్త ప్రధాన కోచ్‌తో రావచ్చు సూచనలు కనిపిస్తున్నాయి.

నిజానికి, ప్రస్తుత జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే కాంట్రాక్ట్ సెప్టెంబర్‌లో ముగియనుంది. ఫ్రాంచైజీ అతని ఒప్పందాన్ని పునరుద్ధరించే ఆలోచనల్లో లేదు. ఎందుకంటే.. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. ఇది మాత్రమే కాదు, 2014 నుంచి ఈ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేదు. IPL 2014లో పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ XI పంజాబ్) జట్టు ఫైనల్‌కు చేరుకుని రన్నరప్‌గా నిలిచింది.

పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే కాంట్రాక్ట్‌ను పొడిగించదు. అయితే అనిల్ కుంబ్లే స్థానంలో ఇయాన్ మోర్గాన్ లేదా ట్రెవర్ బేలిస్ వంటి అనుభవజ్ఞులను తీసుకోవాలని చూస్తోంది. 

ఇవి కూడా చదవండి

ఇయాన్ మోర్గాన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సెప్టెంబరులో భారత్‌లో జరగనున్న లెజెండ్స్ లీగ్‌లో అతను ఆడనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లు ఈ లీగ్‌లో పాల్గొంటారు. ఐపీఎల్‌లో కూడా చాలా కాలం పాటు ఆడిన అనుభవం ఉంది. అంతేకాదు కొంతకాలం అతను KKR కెప్టెన్‌గా కూడా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం