AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ రాడిక్సో తేదీలలో పుట్టినవారు నటనలో నిష్ణాతులు.. కళారంగంలో అదరగొట్టేస్తారు.. ఎవరో తెలుసా..

Numerology Life Path Number 7: సరి, బేసి సంఖ్యలలో జన్మించిన వ్యక్తులు మోడలింగ్, ఆర్ట్, రైటింగ్ రంగంలోఅద్భుతంగా రాణిస్తారు. ఉత్తమ వృత్తిని ఎంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

Numerology: ఈ రాడిక్సో తేదీలలో పుట్టినవారు నటనలో నిష్ణాతులు.. కళారంగంలో అదరగొట్టేస్తారు.. ఎవరో తెలుసా..
Numerology Life Path Number
Sanjay Kasula
|

Updated on: Aug 18, 2022 | 1:57 PM

Share

జీవితంలో అభివృద్ధి జన్మ జ్యోతిష్యం ప్రకారం జరుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు. మరికొందరు న్యూమరాలజీని నమ్ముతుంటారు. చైనా, జపాన్ వంటి అభివృద్ది చెందిన దేశాల్లో ఈ నమ్మకాలు ఎక్కువ ఉంటాయి. అదే మన లాంటి దేశాలు ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. అసలు సంగతికి వస్తే.. మనం జన్మించిన తేదీ.. 7, 16 లేదా 25వ తేదీల్లో పుట్టిన వ్యక్తులు. అతని రాడిక్స్ సంఖ్య 7 (ములంకనం 7, అంటే రెండు సంఖ్యలను కలిపేవారు). వీరికి అధిపతి కేతువు. రాడిక్స్ 7 కింద జన్మించిన వ్యక్తులు పరిశోధకులుగా మారుతారు. సంఖ్య 7 కూడా ప్రకృతిలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ విశ్వంలో ఏడు మహాసముద్రాలు, ఏడు శబ్దాలు, ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉన్నాయి. దీని వల్ల కూడా ఈ రాడిక్స్‌లో జన్మించిన వారి ప్రాముఖ్యత పెరుగుతుంది. వారు తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. వారికి ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా ఆసక్తి ఉంటుంది. వారిలో అసాధారణమైన సామర్థ్యం ఉంది. దీని కారణంగా వారు ఏ పని చేసినా ఫలితం చాలా త్వరగా అందుకుంటారు. వారు తమ వ్యాపారం గురించి చాలా సీరియస్‌గా ఉంటారు.

ఈ కెరీర్ వైపు ఆకర్షితులవుతారు..

రాడిక్స్ 7లో జన్మించిన వ్యక్తులు గ్లామర్, కళను తమ సర్వస్వంగా భావిస్తారు. వీరిలో సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువ. ఈ వ్యక్తులు ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉంటారు. వారికి చదవడం, రాయడం మీద పెద్దగా ఆసక్తి ఉండదు. వీరికి ఆధ్యాత్మికత పట్ల మక్కువ ఎక్కువ.

ఇవి కూడా చదవండి

నిర్ణయం తీసుకోవడంలో జాప్యం 

రాడిక్స్ 7లో జన్మించిన వారిలో సొంత నిర్ణయాలు తీసుకోలేకపోవడం పెద్ద లోపంగా చెప్పవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. వారు ఒంటరిగా ఎటువంటి నిర్ణయం తీసుకోనవసరం లేదని వారు చాలా విషయాలను ఎల్లప్పుడూ పక్కన పెట్టేస్తుంటారు.

ఓపికగా, తీవ్రంగా ఉన్నారు..

రాడిక్స్ 7 ఉన్న వ్యక్తులు అందాన్ని ఇష్టపడేవారు. సౌకర్యాన్ని కోరుకునేవారు. వారు తమ జీవితాన్ని పూర్తి వైభవంగా, ఐశ్వర్యంతో గడపడానికి ఇష్టపడతారు. ఈ సంఖ్యలో జన్మించిన వ్యక్తులు చాలా ఓపికగా, ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వారు తమ జీవితంలో ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు. కళ, సంస్కృతి పట్ట ఎక్కువ మక్కువ, అంకితంతో ఉంటారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.  నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం