Hair Oil: ఇలాంటి సమయంలో జుట్టుకు నూనె రాసుకోకండి..మరింత సమస్య పెరుగుతుంది..

జుట్టుకు ఆయిల్ అప్లై చేయడం మంచిది. కానీ అలా చేయడం అన్ని సమయాల్లో సరికాదు. మీకు కూడా ఈ సమస్యలు ఏవైనా ఉంటే.. మీరు తలకు నూనె రాసుకోవడం మానుకోవాలి.

Hair Oil: ఇలాంటి సమయంలో జుట్టుకు నూనె రాసుకోకండి..మరింత సమస్య పెరుగుతుంది..
Hair Oil
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 17, 2022 | 2:14 PM

జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉండటానికి నూనెను రాయడం మంచిది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే నూనె రాయడం తప్పనిసరి. చంపిరి జుట్టును ఒత్తుగా, దృఢంగా చేస్తుంది. కానీ కొన్నిసార్లు జుట్టుకు నూనె రాయడం వల్ల మీ సమస్య పెరుగుతుంది. కొందరికి స్కాల్ప్, స్కిన్‌లో అనేక రకాల సమస్యలు ఉంటాయి. అవి నూనెను అప్లై చేయడం ద్వారా తీవ్రమవుతాయి. మీరు ఎలాంటి సమయంలో నూనె రాయకూడదో తెలుసుకుందాం..

ఈ పరిస్థితుల్లో జుట్టుకు నూనె రాసుకోవడం మానుకోండి..

1- చుండ్రు ఉంటే-  చుండ్రు సమస్య ఉంటే జుట్టుకు నూనె రాయకండి. జుట్టుకు నూనె రాసుకోకపోవడం వల్ల చుండ్రు మరింత పెరుగుతుందని కొందరు అనుకుంటారు. ఇది తప్పుడు భావన. చుండ్రు అనేది ఒక సాధారణ సమస్య. స్కాల్ప్‌లో ఫంగస్‌ వల్ల చుండ్రు మొదలవుతుంది. దీనికి కారణం తలపై ఉండే నూనె. అటువంటి సమయంలో నూనెను పూయడం ద్వారా ఈ సమస్య తీవ్రమవుతుంది. 

ఇవి కూడా చదవండి

2- మొటిమలు ఉంటే- మీ ముఖం మీద మొటిమలు ఉంటే. ముఖ్యంగా ఈ సమస్య నుదుటిపై ఎక్కువగా వస్తుంది. ఇలాంటి సమయంలో జుట్టుకు నూనె రాసుకోవడం మానుకోవాలి. జుట్టు నుంచి నేరుగా చర్మానికి నూనె చేరుతుంది. దీంతో చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇది మొటిమల సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. మొటిమలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే జుట్టును నూనె లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. 

4- ఆయిల్ స్కాల్ప్ ఉంటే- మీ స్కాల్ప్ జిడ్డుగా ఉంటే, తలకు నూనె రాసుకోకూడదు. అధిక నూనె వల్ల చర్మంలో దుమ్ము పేరుకుపోవడం, చికాకు వంటి అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది మీ జుట్టు రాలడం సమస్యను మరింత పెంచుతుంది. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం..