Tomato Juice Benefits: రోజంతా చురుకుగా, హెల్తీగా ఉండాలా.. టిఫిన్ తర్వాత టొమాటో జ్యూస్ తాగండి చాలు.. ఎలా తీసుకోవాలంటే..

మీ ఆరోగ్యానికి మేలు చేసే టొమాటోలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. టొమాటోలో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ చర్మం, గుండె, కళ్ళు సమస్యలను తొలగిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో టొమాటో జ్యూస్ తాగడం వల్ల మీ పొట్ట, రోజంతా యాక్టివ్‌గా ఉంటుంది. టమోటా రసం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

Tomato Juice Benefits: రోజంతా చురుకుగా, హెల్తీగా ఉండాలా.. టిఫిన్ తర్వాత టొమాటో జ్యూస్ తాగండి చాలు.. ఎలా తీసుకోవాలంటే..
Tomato Juice
Follow us

|

Updated on: Aug 17, 2022 | 5:05 PM

టమోటా చెట్నీ, టమోటా కర్నీ, టమోటా చారు, టమోటా పప్పు.. ఇలాందులో అందులో అని లేకుండా అన్ని వంటల్లో దాదాపుగా టమోటాలను ఉపయోగిస్తుంటారు. దాని చట్నీ పకోరలు, పరాఠాల రుచిని రెట్టింపు చేస్తుంది. టొమాటో మీ ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. టొమాటోలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. మీరు మినరల్స్ , విటమిన్లు సమృద్ధిగా ఉండే టొమాటో జ్యూస్‌ని కూడా తయారు చేసి త్రాగవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో టొమాటో జ్యూస్ తాగడం వల్ల మీ పొట్ట శుభ్రంగా ఉంటుంది. మీరు రోజంతా కూడా యాక్టివ్‌గా ఉంటారు. టమోటా జ్యూస్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయో తెలుసుకుందాం.

స్కిన్..

టొమాటో రసం మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. సూర్యరశ్మితో ఏర్పడే చర్మం రంగు ఇది మార్చేస్తుంది. మొటిమలు వంటి సమస్యలను టమోటా రసంతో అధిగమించవచ్చు. ఇది మీ చర్మ రంధ్రాలను తెరిచి ఉంచుతుంది.  జిడ్డుగల చర్మంలో సెబమ్‌ను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఐరన్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియ

టొమాటో జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.

గుండె

టమోటా రసం చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. టొమాటోలు విటమిన్ సి, విటమిన్ ఎ, బీటా కెరోటిన్, లైకోపీన్  మంచి మూలం అని చెప్పవచ్చు. ఇవి రక్త నాళాలను బలోపేతం చేస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, టమోటాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంట, ఆక్సీకరణ ఒత్తిడి కూడా అదుపులో ఉంటుంది.

కళ్ళు

టొమాటోలో లుటిన్, జియాక్సంటిన్ ఉన్నాయి. ఇవి అతి నీలి కిరణాల నుంచి కళ్ళను రక్షిస్తాయి. టమోటాలు తినేవారి కళ్లు చాలా కాలం పాటు బాగా పనిచేస్తాయని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. దీనితో పాటు, టొమాటోలోని పోషకాలు కంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.

నోటి ఆరోగ్యం

టమోటాలలో ఉండే లైకోపీన్ మీ చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులను నయం చేస్తుంది. నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. అయితే పచ్చి టొమాటోలను మాత్రం ఎక్కువగా తీసుకోవద్దు.

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం