Banana: అరటి పండ్లు ఎక్కువగా తినేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు.. జాగ్రత్త
Health Tips: అరటి పండులో ఎన్నో ఆరోగ్య పోషకాలున్నాయి. పైగా రుచిగానూ ఉంటుంది. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ దీనిని ఇష్టంగా తింటుంటారు. అరటి పండ్లలో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్, ప్రోటీన్స్, బి6, విటమిన్ సి తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
Health Tips: అరటి పండులో ఎన్నో ఆరోగ్య పోషకాలున్నాయి. పైగా రుచిగానూ ఉంటుంది. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ దీనిని ఇష్టంగా తింటుంటారు. అరటి పండ్లలో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్, ప్రోటీన్స్, బి6, విటమిన్ సి తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తీసుకుంటే గుండె జబ్బులతో పలు ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పైగా ఇతర పండ్లతో పోల్చుకుంటే అరటి పండ్ల ధరలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇక చాలామంది ఆకలేసినప్పుడు అరటి పండ్లను తింటుంటారు. దీని వల్ల కడుపు కాస్త నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతి ఏదైనా అనర్థమే. అరటి పండు విషయంలోనూ ఇది వర్తిస్తుంది. మోతాదుకు మించి అరటి పండ్లను తీసుకోవడం వల్ల పలు ప్రతికూల ప్రభావాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
అరటి పండ్లతో అనార్థాలు
- అరటి పండులోని కొన్ని సమ్మేళనాలు మైగ్రేన్‌ని ప్రేరేపిస్తాయి.
- అతిగా అరటి పండ్లు తింటే మలబద్ధకంతో పాటు కొన్ని ఉదర సంబంధిత సమస్యలు వేధిస్తాయి.
- డయాబెటిక్ బాధితులు అరటి పండ్లను తినకూడదు. ఇందులోని ఫ్రక్టోజ్ రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతుంది.
- మోతాదుకు మించి అరటి పండ్లను తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు.
- అరటి పండ్లలోని ఫైబర్ వద్ద కొందరికి అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు తలెత్తుతాయి.
- ఈ పండుని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంత సమస్యలు వస్తాయి.
- కిడ్నీ బాధితులు అరటి పండ్లకు వీలైనంత వరకు దూరంగా ఉండడమే మంచిది.
- వెంటవెంటనే అరటి పండ్లు తింటే నరాలకు హాని కలుగుతుంది.
- అరటి పండులోని పొటాషియం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు తలెత్తవచ్చు
- రోజుకు కేవలం రెండు అరటి పండ్లు తీసుకోవాలి. అంతకుమించి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.
- ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు వైద్యులని సంప్రదించిన తర్వాతే అరటి పండుని తినాలి.
గమనిక: ఈ కథనంలోని అందించిన చిట్కాలు, సలహాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా చిట్కాలను, పద్ధతులను ప్రారంభించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..