Tees Maar Khan: ‘తీస్ మార్ ఖాన్’ రివ్యూ.. రొటీన్ యాక్షన్ థ్రిల్లర్..

వరుస సినిమాలతో బిజీగా ఉండే ఆది సాయికుమార్.. తాజాగా తీస్ మార్ ఖాన్ అంటూ యాక్షన్ సినిమాతో వచ్చేసారు. మరి ఈ చిత్రంలో నిజంగానే అంత యాక్షన్ ఉందా.. ఆడియన్స్‌ను మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే..

Tees Maar Khan: 'తీస్ మార్ ఖాన్’ రివ్యూ.. రొటీన్ యాక్షన్ థ్రిల్లర్..
Tees Maar Khan
Follow us
Basha Shek

|

Updated on: Aug 19, 2022 | 9:50 PM

మూవీ రివ్యూ: తీస్ మార్ ఖాన్

నటీనటులు: ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, పూర్ణ, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ తదితరులు

మ్యూజిక్: సాయి కార్తీక్

ఇవి కూడా చదవండి

ఎడిటర్: మణికాంత్

సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి

దర్శకుడు: కళ్యాణ్ జి గోగణ

నిర్మాత: నాగం తిరుపతి రెడ్డి

రిలీజ్ డేట్: 2022-08-19

వరుస సినిమాలతో బిజీగా ఉండే ఆది సాయికుమార్.. తాజాగా తీస్ మార్ ఖాన్ అంటూ యాక్షన్ సినిమాతో వచ్చేసారు. మరి ఈ చిత్రంలో నిజంగానే అంత యాక్షన్ ఉందా.. ఆడియన్స్‌ను మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా..? అసలు తీస్ మార్ ఖాన్ ఎలా ఉన్నారు..?

కథ:

తీస్ మార్ ఖాన్ (ఆది) అనాథ. ఆయనను మరో అనాధ వసు (పూర్ణ) చేరదీస్తుంది. తల్లి లేని తీస్ మార్ ఖాన్.. ఆమెనే అమ్మగా అనుకుంటాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే అమ్మకు ఏ చిన్న కష్టం వచ్చినా సహించలేడు. అలాంటి అమ్మకు చక్రీ (సునీల్)తో పెళ్లి జరుగుతుంది. అదే సమయంలో అనగా (పాయల్ రాజ్‌పుత్)‌ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు తీస్ ‌మార్ ఖాన్. అంతా బాగుందనుకుంటున్న సమయంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తుంది తీస్ మార్ ఖాన్ తల్లి. ఆ మరణానికి జీజా (అనూప్ సింగ్ ఠాకూర్) అనే అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ..

కథనం:

తీస్ మార్ ఖాన్ కొత్త సినిమా ఏం కాదు.. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ చూసాం. మరోసారి అలాంటి కథతోనే వచ్చాడు దర్శకుడు కళ్యాణ్. కమర్షియల్ ఫార్మాట్‌లోనే కథ రాసుకుని.. దానికి కావాల్సిన హంగులు ఇవ్వడానికి చూసాడు దర్శకుడు. కథలో పెద్దగా మలుపులు ఉండవు కానీ ఉన్నంతలో బాగానే తీయడానికి ప్రయత్నించాడు దర్శకుడు. ఆది పాత్రను బాగానే మలిచాడు. ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా తిరిగే తీస్ మార్ ఖాన్ ఉన్నట్లుండి పోలీస్ ఆఫీసర్ ఎందుకయ్యాడు.. ప్రాణంగా ప్రేమించే అమ్మ మరణానికి మాఫియాకు లింక్ ఏంటి..? అమ్మ మరణం వెనుక గుట్టును తీస్ మార్ ఖాన్ రట్టు చేశాడు అనేది ఈ సినిమా కథ. తీస్ మార్ ఖాన్, వసు బాల్యంలో ఎదురైన అనుభవాలు, కష్టాలతో సినిమా కథ ఎమోషనల్‌గా మారుతుంది. అయితే ఈ క్రమంలో వచ్చే చైల్డ్ ఎపిసోడ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తాయి. పైగా రొటీన్ కంటెంట్ కావడం కూడా తీస్ మార్ ఖాన్‌కు మైనస్‌గా మారింది. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ్నుంచి బాగానే ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు. పాయల్ రాజ్‌పుత్, ఆది మధ్య లవ్ ట్రాక్ పర్లేదు. పూర్ణ మరణం తర్వాత చోటుచేసుకొన్న సంఘటనలు కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది. తీస్ మార్ ఖాన్ పోలీస్ ఆఫీసర్ కావడమనే ట్విస్టుతో ఇంటర్వెల్ వస్తుంది. ఆ తర్వాత రొటీన్ ఫార్మాట్‌లోనే కథ ముందుకు వెళ్తుంది.

నటీనటులు:

ఆది సాయి కుమార్ లవర్ బాయ్‌గానే కాకుండా యాక్షన్ హీరోగానూ బాగానే ట్రై చేసాడు. ఉన్నంతలో బాగానే నటించాడు ఈయన. డైలాగులు చాలా బాగా చెప్పాడు. అమ్మ సెంటిమెంట్‌ ఎపిసోడ్స్‌లో ఆది మెచ్యురిటీ కనిపించింది. పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ తీస్ మార్ ఖాన్‌కు ప్రధానాకర్షణ. కథ మొత్తం పూర్ణ, సునీల్, ఆది మధ్య జరగడం వల్ల పాయల్‌కు పెద్దగా స్కోప్ దక్కలేదు. కబీర్ ఖాన్, అనూప్ సింగ్ ఠాకూర్, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలు ఓకే.

టెక్నికల్ టీం:

సంగీత దర్శకుడు సాయి కార్తిక్ పెద్దగా చెప్పుకునే పాటలైతే ఇవ్వలేదు. బీచ్ సాంగ్ విజువల్‌గా బాగుంది. బ్యాంగ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాటోగ్రాఫర్ బాల్‌రెడ్డి వర్క్ బాగుంది. ఎడిటర్ మణికాంత్ పనితీరు ఆకట్టుకుంటుంది. దర్శకుడు కల్యాణ్ జీ గోగణ తీసుకున్న పాయింట్ బాగుంది.. కానీ దాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయాడు. సెంటిమెంట్ పండించే వీలున్నా.. ఎక్కువగా మాస్ యాక్షన్ వైపు వెళ్లాడు. దాంతో అసలు కథలో ఎమోషన్స్ పక్కదారి పట్టినట్లు అనిపించాయి. డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. పైగా ఆయన నటుడిగానూ ఆకట్టుకున్నారు.

పంచ్ లైన్:

తీస్ మార్ ఖాన్.. రొటీన్ కమర్షియల్ సినిమా

– ప్రవీణ్ కుమార్, TV9ET

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!