AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sena vs Sena: విల్లు, బాణం గుర్తు కోసం షిండే, థాక్రేల పోరు.. శివసేన వివాదం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ..

Maharashtra political crisis: శివసేన పార్టీ గుర్తు విల్లు, బాణం ఎవరిది? రియల్‌ సేనదా, రెబల్‌ సేనదా? ఈ వివాదంపై రాజ్యాంగ ధర్మాసం విచారణ చేపట్టనుంది.

Sena vs Sena: విల్లు, బాణం గుర్తు కోసం షిండే, థాక్రేల పోరు.. శివసేన వివాదం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ..
Shiv Sena Symbol
Sanjay Kasula
|

Updated on: Aug 23, 2022 | 10:13 PM

Share

శివసేనలో(Shiv Sena) చీలికతో ఆ పార్టీ గుర్తు కోసం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ వర్గం(Eknath Shinde), మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే వర్గం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేశారు. ఈ నెల 25న రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతుంది. అప్పటి వరకు శివసేన పార్టీ గుర్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. పార్టీ ఫిరాయింపులు, విలీనం, చీలిక, అనర్హతలకు సంబంధించిన అంశాలపై థాక్రే, షిండే వర్గాలు ఈ పిటిషన్లు వేశాయి.

వాటిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే అసలైన శివసేన పార్టీ తమదేనంటూ షిండే వర్గం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. పార్టీపై కంట్రోల్‌ను, విల్లు, బాణం గుర్తును తమకే కేటాయించాలని కోరింది. అయితే దీన్ని థాక్రే వర్గం వ్యతిరేకించింది. సుప్రీంకోర్టులో విచారణ పూర్తి కానందున, షిండే వినతిపై చర్యలు తీసుకోవద్దని కోరింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. విల్లు, బాణం గుర్తు తమదేనని రుజువు చేసే డాక్యుమెంట్లను సమర్పించాలని షిండే, ఉద్ధవ్‌ వర్గాలకు సూచించింది.

శివసేన శాసనసభా పక్షంతో పాటు పార్టీ సంస్థాగత విభాగ సభ్యుల మద్దతు లేఖలను కూడా ఇవ్వాలని రెండు వర్గాలను కోరంది. దీంతో థాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇంకా తేలలేదు కాబట్టి షిండే వర్గం అర్జీపై ఈసీ చర్యలు తీసుకోకుండా ఆపాలని పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై గతంలోనే విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రస్తుతానికి షిండే వర్గం వినతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఎన్నికల కమిషన్‌కు స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ పిటిషన్లపై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.

ఇవి కూడా చదవండి