Telangana: హైదరాబాద్ లో బయో ఆసియా సదస్సు.. హాజరుకానున్న 70 దేశాల ప్రముఖులు..
ప్రపంచ స్థాయి సదస్సుకు హైదరాబాద్ మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఫ్రిబవరి 24వ తేదీ నుంచి 3 రోజులపాటు బయో ఆసియా సదస్సు 20వ ఎడిషన్ జరగనుంది. 2022 సదస్సును తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో
Telangana: ప్రపంచ స్థాయి సదస్సుకు హైదరాబాద్ మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఫ్రిబవరి 24వ తేదీ నుంచి 3 రోజులపాటు బయో ఆసియా సదస్సు 20వ ఎడిషన్ జరగనుంది. 2022 సదస్సును తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించినప్పటికి కోవిడ్ కారణంగా వర్చువల్ విధానంలో ఈసదస్సును నిర్వహించారు. కోవిడ్ నుంచి కోలుకుని సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భౌతికంగా ఈసదస్సును నిర్వహించనున్నారు. ఈసదస్సుకు సంబంధించిన లోగోను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్.. షేపింగ్ ది నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్’ ఇతివృత్తంతో ఈసదస్సు జరగనుంది. దాదాపు 70 దేశాలకు చెందిన ప్రముఖులతో సమా 37,500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్ ఫోరం అయిన బయో ఆసియా సదస్సుకు ఈఏడాది కూడా తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనుంది. వివిధ దేశాల ప్రభుత్వాలకు చెందిన ప్రముఖులు, పరిశ్రమల అధిపతులు, పరిశోధకులు, వివిధ సంస్థల వ్యవస్థాపకులు, కంపెనీల ప్రతినిధులు ఈసదస్సులో పాల్గొంటారు. కోవిద్ పరిస్థితుల నుంచి కోలుకుని ప్రపంచ వ్యాప్తంగా సాధారణ స్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ స్థాయి ప్రముఖుల సదస్సును హైదరాబాద్ లో ఏర్పాటుచేయనుండటం సంతోషంగా ఉందని లోగో విడుదల సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ఔషధ రంగంలో సమిష్టి అవకాశాలపై పరిశోధకులు, విద్యాసంస్థలు, పరిశ్రమలు ఆరోగ్య సంరక్షణ ప్రధాతలు, విధాన నిర్ణేతలు చర్చించే ప్రపంచస్థాయి సదస్సుగా బయో ఆసియా సదస్సు గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..