Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగుస్తున్న ఉచ్చు.. అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం..

ఇమ్రాన్‌ఖాన్‌ పై ఇప్పటికే ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నమోదైన కేసు విచారణ పెండింగ్‌లో ఉంది. తాజాగా కోర్టు ధిక్కార కేసును కూడా ఇమ్రాన్‌ ఎదుర్కొంటున్నారు.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగుస్తున్న ఉచ్చు.. అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం..
Ex Pakistan Pm Imran Khan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 24, 2022 | 7:08 AM

Imran Khan Arrest: పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. కొద్ది రోజులుగా ఆయన అరెస్టుపై పాక్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చివరకు ఇదే నిజం కాకుంది.. ఇమ్రాన్‌ చుట్టూ బలంగా ఉచ్చు బిగుస్తోంది ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం. ఇమ్రాన్‌ఖాన్‌ పై ఇప్పటికే ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నమోదైన కేసు విచారణ పెండింగ్‌లో ఉంది. తాజాగా కోర్టు ధిక్కార కేసును కూడా ఇమ్రాన్‌ ఎదుర్కొంటున్నారు. ఆయన ఇప్పటికే బెయిల్‌ తీసుకున్నారు. అయితే ఈ బెయిల్‌ ఆగస్టు 25వ తేదీతో ముగుస్తోంది. వెంటనే ఆయన్ని అదుపులోకి తీసుకుంటామని పాక్‌ అంతర్గత భద్రతా మంత్రి సనావుల్లా తెలిపారు. పూర్తి న్యాయ సలహా తీసుకున్నాకే ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేయబోతున్నామని సనావుల్లా తాజాగా ప్రకటించడం పాకిస్థాన్ రాజకీయాల్లో దుమారం రేపింది.

ఇమ్రాన్‌ ఖాన్‌ మీద ఇప్పటికే ఉన్న ఉగ్రవాద వ్యతిరేక చట్టం కేసుపై ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రీ-అరెస్టు బెయిన్‌ను మంజూరు చేసింది. యాంటీ టెర్రరిస్టు కోర్టును కూడా ఆశ్రయించాలని సూచించింది. అయితే ఇమ్రాన్‌ఖాన్‌ ఆగస్టు 20వ తేదీన ఇస్లామాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రభుత్వంతో పాటు న్యాయ వ్యవస్థపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైన్యం, ప్రభుత్వ అధికారులతో పాటు, మహిళా న్యాయమూర్తిని, పోలీసులపై ఆయన ఆరోపణలు గుప్పించారు. దీంతో ఉగ్రవాద నిరోధక చట్టంతోపాటుగా కోర్టు ధిక్కార కేసు కూడా ఇమ్రాన్‌ మీద నమోదైంది.

ఈ నేపథ్యంలో.. ఆగస్టు 25వ తేదీన ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు ఖాయమని తెలుస్తోంది. ప్రధాని పదవి కోల్పోయి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రజల మద్దతును కూడగట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పుడాయన అరెస్టయితే భవిష్యత్‌ ప్రణాళికలన్నీ తారుమారయ్యే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!