IAF: పాక్ భూభాగంలో పేలిన భారత క్షిపణి.. చర్యలు తీసుకున్న కేంద్రప్రభుత్వం
అధికారుల పొరపాటుతో బ్రహ్మోస్ క్షిపణి పొరుగుదేశం పాకిస్తాన్ లో పడిన ఘటనపై కేంద్రప్రభుత్వంపై కఠిన చర్యలు చేపట్టింది. ఈఏడాది మార్చిలో భారత రక్షణ వ్యవస్థకు చెందిన బ్రహ్మోస్ క్షిపణి పొరపాటున పాక్ భూభాగంలో పడింది. ఈఘటనపై..
అధికారుల పొరపాటుతో బ్రహ్మోస్ క్షిపణి పొరుగుదేశం పాకిస్తాన్ లో పడిన ఘటనపై కేంద్రప్రభుత్వంపై కఠిన చర్యలు చేపట్టింది. ఈఏడాది మార్చిలో భారత రక్షణ వ్యవస్థకు చెందిన బ్రహ్మోస్ క్షిపణి పొరపాటున పాక్ భూభాగంలో పడింది. ఈఘటనపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ లోని భారత రాయబారిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కేంద్రప్రభుత్వం ముగ్గురు వాయుసేన అధికారులను ప్రాథమిక బాధ్యులుగా గుర్తిస్తూ.. వారిని విధుల నుంచి తొలగించినట్లు ఈరోజు ప్రకటించింది. అధికారుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈఏడాది మార్చి 9వ తేదీన క్షిపణి ప్రమాదవశాత్తు పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లింది. ఈఘటనపై కేంద్రప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఈఘటనకు ముగ్గురు అధికారులను బాధ్యులుగా గుర్తించింది. వీరు నిబంధనలు ఉల్లఘించడం వలనే ఈఘటన జరిగిందని కమిటీ సమర్పించిన నివేదికలో పేర్కొంది. పాక్ భూభాగంగలో ప్రమాదవశాత్తు క్షిపణి కూలిన ఘటనపై గతంలోనే భారత్ విచారం వ్యకం చేసిన విషయం తెలిసిందే.
భారత్ నుంచి పాక్ భూభాగంలోకి దూసుకెళ్లిన క్షిపణి 40 వేల అడుగుల ఎత్తుల్లో వచ్చి మియాన్ చన్నూ నగరంలో కుప్పకూలిందని పాకిస్తాన్ గతంలో వెల్లడించింది. ఆక్షిపణి ప్రయోగం వల్ల తమ దేశంలో ఆస్తులకు నష్టం కలగడంతోపాటు.. పౌరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని పాకిస్తాన్ లోని భారత రాయబారికి స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో పొరపాటున క్షిపణి పాక్ భూభాగలోకి వెళ్లిందని తేల్చిన భారత్ ముగ్గురు అధికారులపై వేటు వేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..