Health Care: రోజూ పెరుగుతో కలిపి దీనిని తింటే అద్భుతమైన ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు అంతే..

పెరుగు, రోటీని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఆహారంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.

Health Care: రోజూ పెరుగుతో కలిపి దీనిని తింటే అద్భుతమైన ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు అంతే..
Curd
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 24, 2022 | 8:29 AM

Benefits Of Eating Curd And Roti: పెరుగు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. పెరుగు ప్రోబయోటిక్‌కు మంచి మూలం. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించి ఆరోగ్యంగా ఉండేలా పనిచేస్తుంది. అదే సమయంలో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పెరుగులో ఉంటాయి. దీనివల్ల పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మీరు పెరుగు, రోటీని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఆహారంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. పెరుగు, రోటీ తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగు, రోటీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

జీర్ణ శక్తి మెరుగుపడుతుంది: రోటీతో పెరుగు తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణ శక్తి కూడా బలంగా మారుతుంది. ఉదర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. పెరుగు ఉత్తమ ప్రోబయోటిక్స్‌కి మంచి మూలం. దీంతోపాటు రోటీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ ఆహారం తినడం వల్ల పేగులో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనితో పాటు మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, మంటలో ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.

ఇవి కూడా చదవండి

రోగనిరోధక శక్తి: పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల పెరుగు, రోటి శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. ప్రతిరోజూ పెరుగు రోటీని తీసుకుంటే జలుబు, దగ్గు వంటి వైరల్‌లతో పోరాడటానికి ఇది మీకు సహాయపడుతుంది.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: పెరుగులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మరోవైపు, రోటీతో పాటు పెరుగు తీసుకోవడం వల్ల ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతాయి. ఈ మిశ్రమం ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా చేస్తుంది.

ఎముకలు బలపడతాయి: పెరుగులో ప్రోటీన్, క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. మరోవైపు, రోజూ పెరుగు, రోటీని తీసుకుంటే ఎముక పగుళ్లు, కీళ్ల నొప్పుల ప్రమాదం కూడా తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..