Ravi Kiran |
Updated on: Aug 24, 2022 | 9:55 AM
బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం. అయితే మేము ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఫుడ్స్ మీ డైట్‌లో చేరిస్తే.. ఈజీగా బరువు తగ్గొచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం పదండి..!
పాలకూర- పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంది. అలాగే క్యాలరీలు కూడా తక్కువ ఉంటాయి. ఇందులోని ఫైబర్, విటమిన్లు ఎ, సి, కె వంటి పోషకాలు వేగంగా బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. ఒక్క బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. పాలకూర చర్మ ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది.
పుట్టగొడుగులు - పుట్టగొడుగులలో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటి వల్ల హృదయ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అలాగే మష్రూమ్స్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి.
గుమ్మిడికాయ సూప్: గుమ్మిడికాయ సూప్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం. ఆకలి బాధలను తగ్గించడమే కాకుండా బరువు తగ్గడంలోనూ ఈ ఫైబర్ బాగా సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి బలమైన రోగనిరోధకశక్తి వ్యవస్థ చాలా అవసరం. ఈ సూప్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
కాలే- ఈ ఆకుకూర బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు కాలేను స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడానికి పని చేస్తుంది. రోజూ కాలేను తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతమవుతుంది. ఆకలి బాధలు కూడా తగ్గుతాయి.