- Telugu News Photo Gallery Cricket photos India vs Pakistan Asia cup 2022 top cricket controversies between india and pakistan on the cricket field
Ind vs Pak: దాయాదుల పోరు అంటే మాములుగా ఉండదు మరి.. భారత్, పాక్ క్రికెటర్లు ఆవేశంతో రెచ్చిపోయిన సందర్భాలివే
Ind vs Pak, Asia Cup 2022: భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు సమయం దగ్గర పడుతోంది. ఆగస్ట్ కప్ టోర్నీలో భాగంగా ఆగస్టు 28న ఈ రెండు జట్లు దుబాయ్‌లో తలపడనున్నాయి. ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ దృష్టంతా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పైనే ఉంటుంది.
Updated on: Aug 24, 2022 | 7:43 AM

Ind vs Pak, Asia Cup 2022: భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు సమయం దగ్గర పడుతోంది. ఆగస్ట్ కప్ టోర్నీలో భాగంగా ఆగస్టు 28న ఈ రెండు జట్లు దుబాయ్‌లో తలపడనున్నాయి. ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ దృష్టంతా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పైనే ఉంటుంది. ఇదిలా ఉంటే దాయాదుల పోరు జరిగినప్పుడల్లా ఇటు బయట, మైదానంలో ఉత్కంఠ తారా స్థాయికి చేరుకుంటుంది. ఒత్తిడిని తట్టుకోలేక ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం గొడవలకు దిగిన సందర్భాలున్నాయి.

భారత్-పాక్ పోరు అంటే మొదట1996 ప్రపంచకప్‌లో వెంకటేష్ ప్రసాద్, అమీర్ సోహైల్ తలపడిన మ్యాచ్ గుర్తుకొస్తుంది. ఈ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ప్రసాద్ వేసిన బంతిని ఫోర్ కొట్టిన సోహైల్.. మిగిలిన బంతులను కూడా అలాగే బౌండరికి పంపిస్తానని బ్యాట్‌తో సంజ్ఞలు చేశాడు. చెప్పాడు. అయితే ప్రసాద్ మరుసటి బంతికే సోహైల్‌ను బౌల్డ్ చేశాడు. సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రసాద్ అతనికి పెవిలియన్ వైపు దారి చూపించాడు.

పాక్ దిగ్గజం జావేద్ మియాందాద్ టీమిండియా వికెట్ కీపర్ కిరణ్ మోరే మధ్య జరిగిన ఘర్షణ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది.1992 ప్రపంచకప్ మ్యాచ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత వికెట్ కీపర్ కిరణ్ మోరే వికెట్ వెనకాల ఎక్కువగా అప్పీల్ చేయడం మియాందాద్‌ను ఇబ్బంది పెట్టింది. దీంతో తట్టుకోలేక పోయిన మియాందాద్ బౌలర్‌ను ఆపి మోరెతో వాగ్వాదానికి దిగాడు. అతడిని అనుకరిస్తూ మైదానంలో పిచ్చి గంతులు వేశాడు.

2010లో జరిగిన ఆసియాకప్‌లో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్, పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో అక్మల్ గంభీర్ ఎల్‌బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశాడు అక్మల్. దీంతో ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరికొకరు ఎదురుగా వచ్చి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అయితే మిస్టర్ కూల్ ధోనీ, అంపైర్లు వచ్చి సమస్యను సద్దుమణిగించారు.

అంతకుముందు షాహిద్ అఫ్రిదితో కూడా గొడవకు దిగాడు గౌతమ్ గంభీర్. 2007లో భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లోని ఓ మ్యాచ్‌లో ఆఫ్రిది వేసిన బంతికి గంభీర్ పరుగుతీస్తాడు. అయితే పరుగు తీసే సయంలో అఫ్రిదీని అనుకోకుండా ఢీకొడతాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.

ఆసియా కప్-2010లో హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ గొడవపడ్డారు. ఈ మ్యాచ్‌లో అక్తర్, హర్భజన్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. హర్భజన్ సిక్సర్ కొట్టడం ద్వారా భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ షాట్ తర్వాత, షోయబ్ అఖ్తర్ వైపు చూస్తూనే హర్భజన్ సింగ్ విజయాన్ని ఆస్వాదించడం ప్రారంభించాడు. ఇక చాలు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లంటూ షోయబ్ సైగ చేశాడు.




