- Telugu News Photo Gallery Cricket photos 4 fast bowlers injury out of asia cup 2022 tournament jasprit bumrah shaheen afridi chameera harshal
ASIA CUP 2022: ఆసియా కప్‌లో ఈసారి కనిపించని పేస్ దాడి.. లిస్టులో నలుగురు బౌలర్లు.. భారత్ నుంచి ఇద్దరు..
ముఖ్యంగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్ అనూహ్య పరాజయం పాలైన తర్వాత ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం ఆటగాళ్ల గాయాలతో ఈ వాదన మరింత చర్చనీయాంశమైంది.
Updated on: Aug 23, 2022 | 11:52 AM

ఆసియా కప్ 2022 శనివారం నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఆగస్టు 28న జరిగే భారత్-పాకిస్థాన్ పోరుపైనే అందరి ఆసక్తి నెలకొంది. ఈమ్యాచ్‌లో విజేత ఎవరు అనే దానిపై అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్ అనూహ్య పరాజయం పాలైన తర్వాత ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం ఆటగాళ్ల గాయాలతో ఈ వాదన మరింత చర్చనీయాంశమైంది. అది కూడా టోర్నమెంట్‌లోని మూడు అతిపెద్ద జట్లు తమ ముగ్గురు ప్రముఖ ఫాస్ట్ బౌలర్లను కోల్పోవడంతో.. విజయం ఎటువైపు ఉంటుందోనని ఆగా ఎదురుచూస్తున్నారు.

ఇది భారత జట్టుతో ప్రారంభమైంది. ఈ టోర్నీకి సంబంధించి బీసీసీఐ ఆగస్టు 8న తన టీమ్ ఇండియాను ప్రకటించింది. దీనితో పాటు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడినట్లు బోర్డు ప్రకటించింది. ఇది భారత జట్టు, అభిమానులకు పెద్ద దెబ్బలా మారింది. బుమ్రా గైర్హాజరీతో భారత బౌలింగ్ కచ్చితంగా కాస్త వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

జస్ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా టీమ్ ఇండియా అత్యంత ముఖ్యమైన బౌలర్. అయితే హర్షల్ పటేల్ గాయం కారణంగా భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. T20లో డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హర్షల్.. ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం పెద్ద లోటే. గత సంవత్సరం UAEలో ఈ ప్లేయర్ ఆకట్టుకున్నాడు.

బుమ్రా నిష్క్రమణ తర్వాత, టోర్నమెంట్ ముఖ్యంగా భారతదేశం-పాకిస్తాన్ మ్యాచ్పై తీవ్రం ప్రభావం చూపనుంది. పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ షా ఆఫ్రిది గాయపడటంతో అది మరింత దెబ్బతింది. మోకాలి గాయం కారణంగా అఫ్రిది టోర్నీకి దూరమయ్యాడు. గత సంవత్సరం ప్రపంచ కప్‌లో భారత్‌ను ఓడించడంలో అఫ్రిది కీలక పాత్ర పోషించాడు.

భారతదేశం వర్సెస్ పాకిస్తాన్‌ల స్పీడ్ బౌలర్స్ నిష్క్రమించిన తర్వాత శ్రీలంక నుంచి కూడా బ్యాడ్ న్యూస్ వచ్చింది. శ్రీలంక పేస్ బౌలర్ దుష్మంత చమీర గాయం కారణంగా ఆగస్టు 22 సోమవారం టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. చమీరా శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు. అయితే ప్రాక్టీస్ సమయంలో కాలు గాయం కారణంగా అతను తప్పుకున్నాడు. దీంతో ఈ సారి టీంలు స్టార్ పేసర్లు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.





























