Kidney Stones: ఈ లక్షణాలు ఉంటే.. కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే.. ఇలా ముందే జాగ్రత్తపడండి

మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది యువత మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు.

Kidney Stones: ఈ లక్షణాలు ఉంటే.. కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే.. ఇలా ముందే జాగ్రత్తపడండి
Kidney Health
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 24, 2022 | 7:43 AM

మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది యువత మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు. ముఖ్యంగా చాలామంది కిడ్నీ స్టోన్స్‌తో సతమతమవుతున్నారు. కిడ్నీలో రాళ్ల పరిమాణం బట్టి తగిన చికిత్సలు అందించి వీటిని తొలగిస్తారు. అయితే సకాలంలో మూత్రపిండాల్లో రాళ్ల లక్షణాలను గుర్తిస్తే, శస్త్రచికిత్స లేకుండానే రాళ్లను సహజంగా తొలగించవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

పొత్తి కడుపులో.. కిడ్నీ రాళ్లు శరీరంలోని అనేక భాగాలలో నొప్పిని కలిగిస్తాయి. బాధితుల్లో ఎక్కువగా పొత్తికడుపు, వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు రక్తం కూడా పడవచ్చు. దీనిని హెమటూరియా అని కూడా పిలుస్తారు. ఈ రక్తం ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులో ఉండవచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రంలో తీవ్రమైన మంట కలుగుతుంది. అలాగే జ్వరం కూడా వస్తుంది. అకస్మాత్తుగా చెమటలు పట్టడం ప్రారంభమవుతుంది. ఇలాంటి లక్షణాలను అసలు విస్మరించకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇలా ఉపశమనం.. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌ గా ఉంచుకోవాలి. ఎక్కువ నీరు తాగాలి. ఆహారంలో సోడియం మొత్తాన్ని చేర్చాలి. ఎక్కువ విత్తనాలు ఉన్న పండ్లు, కూరగాయల వినియోగాన్ని తగ్గించాలి. తులసిటీ, పానియాలు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చే నొప్పి తగ్గుతుంది. అంతేకాదు తులసి ఆకులతో పలు శారీరక సమస్యలు దూరమవుతాయి. కషాయాలను కూడా తయారు చేసి తాగవచ్చు. తులసిలో విటమిన్ బి ఉంటుంది. ఇది రాళ్ల సమస్యను దూరం చేస్తుంది. ఇది ఆహారంలో ఉప్పుతోపాటు పుల్లని రుచిగా ఉంచుతుంది. మీరు తులసి ఆకులను తినవచ్చు. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో దీన్ని నమిలితే, కిడ్నీ స్టోన్ కరిగి శరీరం నుంచి బయటకు వస్తుంది. ఉల్లిపాయను పచ్చిగా తినాలి. దీని రసాన్ని రోజూ 1-2 టీస్పూన్లు తాగుతుంటే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు.ద్రాక్షలో పొటాషియం, నీరు ఎక్కువగా ఉంటుంది. సోడియం క్లోరైడ్ చాలా తక్కువగా ఉంటుంది. జామకాయ తినడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడవు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..