Sanna Marin: ఫిన్‌లాండ్ ప్రధానికి మద్దతుగా నిలుస్తోన్న ప్రపంచ మహిళా లోకం.. డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ.. అసలు విషయమేంటంటే..
Sanna Marin: ఫిన్‌లాండ్ ప్రధాని సన్నా మారిన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా లోకం మద్దతు నిలుస్తోంది. అనుకోని వివాదంలో ఇరుక్కున్న ఆమెకు ఫిన్‌లాండ్ మహిళలే కాకుండా ఇతర దేశాల వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. డ్యాన్స్‌లు చేస్తూ...
Sanna Marin: ఫిన్‌లాండ్ ప్రధాని సన్నా మారిన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా లోకం మద్దతు నిలుస్తోంది. అనుకోని వివాదంలో ఇరుక్కున్న ఆమెకు ఫిన్‌లాండ్ మహిళలే కాకుండా ఇతర దేశాల వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను #SolidarityWithSanna అనే యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతోంది. డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేయడం ఏంటి.? అసలు ఆ ప్రధాని ఎదుర్కొన్న ఆరోపణలు ఏంటి.? లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఫిన్‌లాండ్ ప్రధాని సన్నా మారిన్ ఇటీవల కొంతమంది మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో సన్నా మోకాళ్ల మీద కూర్చొని డ్యాన్ చేస్తూ కనిపించారు. దీంతో ప్రతిపక్షలు ఆమెపై విమర్శలు కురిపించారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆరోపణలు చేశారు. అయితే ఆమె ఈ ప్రచారాన్ని ఖండించారు. కేవలం ఆల్కహాల్ తీసుకున్నాను అంటూ స్పష్టతనిచ్చినా ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలు మాత్రం ఆగలేవు. దీంతో ఆమె డ్రగ్స్ పరీక్ష చేసుకోగా ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తేలింది.
Finland’s Prime Minister @MarinSanna is in the headlines after a video of her partying was leaked today.
She has previously been criticized for attending too many music festivals & spending too much on partying instead of ruling.
The critics say it’s not fitting for a PM. pic.twitter.com/FbOhdTeEGw
— Visegrád 24 (@visegrad24) August 17, 2022
దీంతో ప్రస్తుతం మహిళా లోకం ఆమెకు మద్దతు నిలుస్తున్నారు. మారిన్ ఎలాగైతే డ్యాన్స్ చేశారో అచ్చంగా అలాగే చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలతో పాటు మేము కూడా డ్యాన్స్ చేస్తున్నాం. మమ్మల్ని కూడా డ్రగ్స్ తీసుకున్నారని అంటారా.? అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియోలు ట్విట్టర్లు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఫిన్‌లాండ్ ప్రధానికి ఇతర దేశాల మహిళలు సైతం మద్దతు నిలుస్తుండడం విశేషం.
Love it! Danish women are posting videos of themselves partying while tagging Finnish Prime Minister Sanna Marin.
To show “Solidarity with Sanna” pic.twitter.com/8gsUTuROLJ
— Very Finnish Problems (@VFinnishProbs) August 20, 2022
If letting off steam at a party is the worst thing your prime minister has done, then you’re a pretty lucky country. ?? #solidaritywithsanna pic.twitter.com/0jGJBKuZ0M
— Fiona Patten MP (@FionaPattenMLC) August 22, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..