AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: తెలంగాణలో హైటెన్షన్.. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతివ్వాలని హైకోర్టులో పిటిషన్‌..

బండి సంజయ్‌ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ 27న జరగాల్సిన నేపథ్యంలో యాత్రలో ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర నిరసనలో బీజేపీ నేతలపై దాడి జరిగిందని

Bandi Sanjay: తెలంగాణలో హైటెన్షన్.. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతివ్వాలని హైకోర్టులో పిటిషన్‌..
Bandi Sanjay
Shaik Madar Saheb
|

Updated on: Aug 24, 2022 | 9:44 AM

Share

Telangana high court – BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌లు పడ్డాయి. సంజయ్‌ను జనగామలో అదుపులోకి తీసుకున్న పోలీసులు కరీంనగర్‌లోని ఇంటి దగ్గర వదిలిపెట్టారు. పాదయాత్రకు అనుమతి లేదని, యాత్రకు రావొద్దని నోటీసులు ఇచ్చారు పోలీసులు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమైంది బీజేపీ. బండి సంజయ్‌ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ 27న జరగాల్సిన నేపథ్యంలో యాత్రలో ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర నిరసనలో బీజేపీ నేతలపై దాడి జరిగిందని, దానికి నిరసనగా దీక్ష చేయబోయారు బండి సంజయ్‌. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్మ దీక్షకు అనుమతి లేదనే కారణంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో జనగామ సమీపంలోని పామునూరు – ఉప్పుగల్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అరగంటసేపు హైటెన్షన్‌ నెలకొంది. సంజయ్‌ను అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు పోలీసులు. అక్కడ కూడా ఉద్రిక్తత నెలకొంది. పాదయాత్రకు, దీక్షకు అనుమతి లేదని, కాబట్టి జనగామ రావొద్దని బండిసంజయ్‌కు నోటీసులు ఇచ్చారు వరంగల్‌ పోలీసులు. ఆయన 24 గంటలు హౌస్‌ అరెస్ట్‌లో ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ నేతలు. యాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని తేల్చి చెప్పారు. కాగా.. పాదయాత్రకు అనుమతిపై హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు బీజేపీ నేతలు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అయితే రెగ్యులర్‌గా పిటిషన్‌ వేయాలని సూచించింది హైకోర్టు.

బండి సంజయ్ ఆగ్రహం..

తన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. ఎక్కడ యాత్రను ఆపారో అక్కడే మళ్లీ ప్రారంభిస్తానని ప్రకటించారు. యాత్రను అడ్డుకుని సీఎం కేసీఆర్‌ తప్పు చేశారని వ్యాఖ్యానించారు. 27న వరంగల్‌లో బహిరంగ సభ జరిపి తీరతామని ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ తరహాలోనే తెలంగాణలోనూ త్వరలో లిక్కర్‌ స్కామ్‌ బయట పడుతుందని వ్యాఖ్యానించారు బండి సంజయ్‌.

ఇవి కూడా చదవండి

పాదయాత్రను అడ్డుకోవడంపై గవర్నర్‌కు ఫిర్యాదు..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణల్ని డైవర్ట్‌ చేసేందుకే బండి సంజయ్‌ పాదయాత్రలో.. టీఆర్‌ఎస్‌ నేతలు అల్లర్లు సృష్టిస్తున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌ ఆరోపించారు. అరచేతితో సూర్యుణ్ని ఆపుతామనుకోవడం రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖత్వమే అవుతుందన్నారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే.. కేసీఆర్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పాదయాత్రను యథావిధిగా కొనసాగించేందుకు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చారు బీజేపీ నేతలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..