AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natural Farming: దేశీయ ఆవుల పెంపకం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రైతులకు నెలకు ఆర్ధిక సాయం అందజేత..

దేశవాళీ ఆవుల పెంపకందారులకు నెలకు రూ.900 సాయం అందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత చెల్లించేందుకు ప్రభుత్వం డబ్బును రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది.

Natural Farming: దేశీయ ఆవుల పెంపకం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రైతులకు నెలకు ఆర్ధిక సాయం అందజేత..
Dairy Farmers
Surya Kala
|

Updated on: Aug 03, 2022 | 7:00 PM

Share

Natural Farming: ఆవులు హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువులు. పాలు శ్రేష్టమైనవి. పేడను పిడకలుగా తయారు చేసి వంటచెరకుగా ఉపయోగిస్తారు. జీవామృతాన్ని ఆవు పేడతో తయారుచేస్తారు. దేశవాళీ ఆవులను పెంచేందుకు ప్రజలు ముందుకు వచ్చినప్పుడే సహజ వ్యవసాయం సాధ్యమవుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకనే ఆవులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక  చర్యలు చేపట్టింది. ఇందుకోసం దేశవాళీ ఆవుల పెంపకందారులకు నెలకు రూ.900 సాయం అందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత చెల్లించేందుకు ప్రభుత్వం డబ్బును రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. మొదటి దశలో 26,000 వేల మంది పశువుల పెంపకందారులకు.. నెలకు రూ.900 చొప్పున ఏడాదికి రూ.28 కోట్ల 08 లక్షల వ్యయం చేసేందుకు శివరాజ్ సింగ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

సహజ వ్యవసాయాన్ని కొనసాగించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి ప్రభుత్వం మధ్యప్రదేశ్. ఇప్పుడు ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతులకు ఏటా రూ. 6000 లభిస్తోంది. ఇప్పుడు పశువుల పెంపకందారులకు ఆవుల పెంపకం కోసం ఏటా రూ. 10,800 అందజేస్తోంది. ఇందుకు గాను ఈ ఏడాది బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

26,000 మంది పశువులకాపరులను ఎలా ఎంపిక చేస్తారంటే..  ప్రతి జిల్లాలోని 100 గ్రామాలలో సహజ వ్యవసాయాన్ని ప్రారంభించే లక్ష్యంతో  “మధ్యప్రదేశ్ ప్రకృతి కృషి వికాస్ యోజన”ను అమలు చేయాలని మధ్యప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. అంతేకాకుండా రైతులకు ఒక దేశవాళీ ఆవు పెంపకంపై గ్రాంట్ ఇవ్వనుంది.  ఈ పథకం కింద 52 జిల్లాల్లోని 100 గ్రామాలను ఎంపిక చేసి మొత్తం 5200 గ్రామాల్లో సహజ వ్యవసాయాన్ని ప్రారంభించనున్నారు.  మొత్తం 26 వేల మంది సహజ వ్యవసాయం చేస్తున్న రైతులను ఎంపిక చేసి ఆవుల పెంపకానికి సాయం అందజేస్తారు.

ఇవి కూడా చదవండి

మాస్టర్ ట్రైనర్ నెలకు రూ.1000  ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం దేశీయ ఆవుల పెంపకందారులకు నెలకు రూ.900 చొప్పున మంజూరు చేసింది. సహజ వ్యవసాయం చేస్తున్న రైతుల కోసం పోర్టల్‌, యాప్‌ను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు. దీనిపై నమోదు చేసుకున్న రైతులకు మాస్టర్ ట్రైనర్లుగా, ట్రైనర్లుగా శిక్షణ ఇస్తారు. ట్రైనర్‌గా పనిచేసినందుకు మాస్టర్ ట్రైనర్‌కు నెలకు రూ.1,000 గౌరవ వేతనం ఇస్తారు. ఈ శిక్షకులను సహజ ప్రేరేపకులు అంటారు.

రైతులకు శిక్షణ ఇచ్చేందుకు రూ.39.5 కోట్లు వెచ్చించనున్నారు శిక్షణ కోసం ఒక్కో రైతుకు రోజుకు 400 ఖర్చు చేస్తారు. ఇందుకోసం 39 కోట్ల 50 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సహజ వ్యవసాయ కిట్‌లను తీసుకునే రైతులకు 75 శాతం రాయితీ ఇవ్వనుంది. రాష్ట్రంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి కృషి వికాస్ బోర్డును ఇప్పటికే ఏర్పాటు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..