AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day 2022: ప్రధాని మోదీ పిలుపును ఫాలో అయిన కాంగ్రెస్ నేతలు.. కానీ అందులో బిగ్ ట్వీస్ట్ ఏమంటే?

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈనెల రెండో తేదీ నుంచి 15వ తేదీ వరకు..

Independence Day 2022: ప్రధాని మోదీ పిలుపును ఫాలో అయిన కాంగ్రెస్ నేతలు.. కానీ అందులో బిగ్ ట్వీస్ట్ ఏమంటే?
Rahul Gandhi (File Photo)
Janardhan Veluru
|

Updated on: Aug 03, 2022 | 6:32 PM

Share

Azadi Ka Amrut Mahotsav: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించింది. ఏంటి.. ఎప్పుడూ బీజేపీ, ప్రధాని మోదీ అంటే మండిపడే కాంగ్రెస్ ఆయన పిలుపును ఫాలో అవ్వడమేంటి అనుకుంటున్నారా..? కాని ఇది నిజం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈనెల రెండో తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజలంతా త్రివర్ణ పతకాన్ని తమ వాట్సప్ అకౌంట్ల డీపీగా.. సోషల్ మీడియా అకౌంట్స్ ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకోవాలని గత మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని పిలుపు మేరకు చాలా మంది తమ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్స్ గా జాతీయ జెండాను పెట్టుకున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ఆచరణలో పెట్టిన వారి జాబితాలో తాజాగా కాంగ్రెస్ నాయకులు చేరారు. ఆపార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, జైరాం రమేష్, పవన్ ఖేరా వంటి వారంతా వారి సామాజిక మాద్యమాల ఖాతాల్లో త్రివర్ణ పతకాన్ని ప్రొఫైల్ పిక్చర్స్ గా పెట్టుకున్నారు. అయితే ఇందులోనే బిగ్ ట్విస్ట్ ఉంది.

కాంగ్రెస్ నాయకులంతా దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జాతీయ జెండాను చేతబట్టిన ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు. బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను చేతిలో పట్టుకున్న ఫోటోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకోవడంతో.. వీరికి కాంగ్రెస్ కౌంటర్ గా నెహ్రూ త్రివర్ణ పతకాన్ని చేతిలో పట్టుకున్న ఫోటో పెట్టుకుంది.

రాహుల్ గాంధీ ట్వీట్..

ప్రియాంక గాంధీ ట్వీట్..

జవహర్ లాల్ నెహ్రూ చేతితో పట్టుకున్న జాతీయ జెండాను ట్విట్టర్ లో పోస్టు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త్రివర్ణ పతకాన్ని చూసి దేశం గర్విస్తోంది. మన త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడి గుండె చప్పుడంటూ హిందీలో ట్వీట్ చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా బీజేపీ ప్రజల్లో దేశభక్తి సెంటిమెంట్ ను రాజకీయంగా వాడుకుంటుందని ఒకవైపు విమర్శిస్తున్న కాంగ్రెస్… కమలం పార్టీకి గట్టి కౌంటరిచ్చేందుకు ఈప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి