IT Employee: ఫలించని 25 ఏళ్ల నిరీక్షణ.. పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో గ్రామానికి రోడ్డు వేయించిన ఐటీ ఉద్యోగి

25 ఏళ్ళు నిరీక్షించినా ఆ యువకుడి కల నెరవేర్చే దిశగా ఏ ప్రభుత్వం పని చేయలేదు. దీంతో తన కలను నెరవేర్చుకోవడానికి.. తన సొంత గ్రామానికి మంచి రోడ్డు ఏర్పాటుకు.. తన పెళ్లి కోసం దాచుకున్న డబ్బులను ఉపయోగించాడు. అవును తన చిన్న గ్రామంలో మంచి రోడ్లు చూడాలన్నది 31 ఏళ్ల పి చంద్రశేఖరన్‌ చిరకాల స్వప్నం.

IT Employee: ఫలించని 25 ఏళ్ల నిరీక్షణ.. పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో గ్రామానికి రోడ్డు వేయించిన ఐటీ ఉద్యోగి
Chennai Techie
Follow us
Surya Kala

|

Updated on: Aug 24, 2022 | 11:32 AM

IT Employee: సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడవోయ్ అన్నారు గురజాడ అప్పారావు. అయితే ఈ మాటను అర్ధం చేసుకుని అతి కొద్ది మాత్రమే ఆచరణలో పెడుతున్నారు. తాజాగా ఓ యువకుడు తన చిన్న గ్రామానికి మంచి రోడ్డు రావాలని చిన్నతనం నుంచి కల కన్నాడు. అయితే 25 ఏళ్ళు నిరీక్షించినా ఆ యువకుడి కల నెరవేర్చే దిశగా ఏ ప్రభుత్వం పని చేయలేదు. దీంతో తన కలను నెరవేర్చుకోవడానికి.. తన సొంత గ్రామానికి మంచి రోడ్డు ఏర్పాటుకు.. తన పెళ్లి కోసం దాచుకున్న డబ్బులను ఉపయోగించాడు. అవును తన చిన్న గ్రామంలో మంచి రోడ్లు చూడాలన్నది 31 ఏళ్ల పి చంద్రశేఖరన్‌ చిరకాల స్వప్నం. అయితే 25 ఏళ్లుగా నిరీక్షించిన చంద్రశేఖర్ తన నెరవేర్చుకోడానికి స్వయంగా రంగంలోకి దిగాడు. ఈ టెక్కీ తన పెళ్లి కోసం పొదుపు చేసిన రూ.10.5 లక్షలతో 280 మీటర్ల పొడవు కాంక్రీట్ రోడ్డు ను వేయించి తన కలను నెరవేర్చుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు విల్లుపురం జిల్లాలోని వనూరుకు 18కిలోమీటర్ల దూరంలో నల్లవూరు గ్రామ నివాసి పి చంద్రశేఖరన్‌. ఈ గ్రామంలో సుమారు   350 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఏడు వీధులు ఉన్నాయి. ఈశ్వరన్ కోయిల్ వీధిలో చంద్రశేఖరన్ బంధువులతో సహా దాదాపు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. పి చంద్రశేఖరన్ రోడ్డు నిర్వహణ గురించి మాట్లాడుతూ.. “మా గ్రామంలో చివరిసారిగా రోడ్లు వేసినప్పుడు తాను ప్రాథమిక తరగతి విద్యార్థిని అని చెప్పాడు. అయితే తాను ఇప్పుడు నా చదువును పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చెన్నై లో ఉద్యోగం చేస్తున్నానని.. అయితే 25 ఏళ్ల తర్వాత కూడా  తమ గ్రామంలో రోడ్ల పరిస్థితిలో ఎటువంటి మార్పులు లేకుండా అలాగే ఉన్నాయని పేర్కొన్నాడు.

BE గ్రాడ్యుయేట్ అయిన చంద్రశేఖర్ తండ్రి ఎస్ పెరుమాళ్ చిన్న వ్యాపారి, తల్లి పి లక్ష్మి గృహిణి. కరోనా మహమ్మారి సమయంలో ఇంటి నుంచి ఉద్యోగ విధులను నిర్వహిస్తున్న చంద్రశేఖర్.. తనకు వీలు దొరికినప్పుడల్లా.. తమ గ్రామంలో కొత్త రోడ్లను వేయమంటూ.. పంచాయతీ , బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసులకు వెళ్లి కోరేవాడు. ప్రతిరోజూ కనీసం ఒక వ్యక్తి అయినా తన గ్రామంలోని బురద రోడ్లపై జారి పడి గాయపడుతున్నారని కనుక రోడ్డు వేయమంటూ అధికారులను విజ్ఞప్తి చేసేవాడు. అయితే చివరకు చంద్రశేఖర్ కు తమకు నిధులు వస్తే తప్ప రోడ్లు వేయలేమని అధికారులు చెప్పారు. దీంతో రోడ్డు ఖర్చుల్లో సంగం తాను భరిస్తానని చెప్పిన చంద్రశేఖర్.. తన పెళ్లి కోసం దాచుకున్న డబ్బులను తమ గ్రామంలోని రోడ్డు వేయడం కోసం ఉపయోగించాడు. రూ.10.5 లక్షలను వెచ్చించాడు. అయితే మొదట్లో చంద్రశేఖర్ సంకల్పానికి రాజకీయ నేతలు అడ్డుపడ్డారు. కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు చంద్రశేఖర్ ను అతని తల్లిదండ్రులను బెదిరించారు. అయినప్పటికీ పట్టుదలతో అన్ని కష్టాలను ఓర్చి.. నెలలో కొన్ని వారాల్లోనే రహదారి పనిని పూర్తి చేశాడు. 280 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతులో సిమెంట్ కాంక్రీట్ రహదారిని వేయించారు. ఇప్పుడు ఇతర వీధుల ప్రజలు మా రహదారిని అసూయతో చూస్తారు..  చంద్రశేఖరన్ లాంటి వ్యక్తి తమ వీధిలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు.  చంద్రశేఖరన్‌ను ప్రభుత్వం ఘనంగా సత్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ