AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scotland: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులతో సహా ముగ్గురు మృతి.. విహారయాత్రకు వెళ్తుండగా..

బెంగళూరుకు చెందిన గిరీష్ సుబ్రమణ్యం (23); హైదరాబాద్‌కు చెందిన పవన్ బశెట్టి (23), సాయి వర్మ చిలకమర్రి (24); ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన సుధాకర్ మోడేపల్లి (30) నలుగురూ స్నేహితులు..

Scotland: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులతో సహా ముగ్గురు మృతి.. విహారయాత్రకు వెళ్తుండగా..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Aug 24, 2022 | 11:34 AM

Share

Scotland Road Accident : స్కాట్లాండ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరణించిన వారిలో హైదరాబాద్‌, నెల్లూరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉండగా.. మరొక విద్యార్థి బెంగళూరుకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. ఈ ఘటన గత శుక్రవారం (ఆగస్టు 19) పశ్చిమ స్కాట్‌లాండ్‌లో జరిగింది. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొంది. బెంగళూరుకు చెందిన గిరీష్ సుబ్రమణ్యం (23); హైదరాబాద్‌కు చెందిన పవన్ బశెట్టి (23), సాయి వర్మ చిలకమర్రి (24); ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన సుధాకర్ మోడేపల్లి (30) నలుగురూ స్నేహితులు.. సెలవులు కావడంతో స్కాట్లాండ్‌ ప్రాంతంలోని పలు ప్రదేశాలకు విహారయాత్రకు బయలుదేరారు. ఈ క్రమంలో గత శుక్రవారం స్కాటిష్ వెస్ట్ హైలాండ్స్‌లోని ఆర్గిల్‌లోని అప్పిన్ ప్రాంతంలో కాజిల్ స్టాకర్ సమీపంలో కారును ట్రక్ ఢీకొట్టింది. గిరీష్, పవన్, సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సాయిను ఎయిర్ అంబులెన్స్‌లో గ్లాస్గోలోని క్వీన్ ఎలిజబెత్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు.

భారత దౌత్య వర్గాల సమాచారం ప్రకారం సాయి పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. ఈ ఘటనకు సంబంధించి లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు స్కాట్లాండ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో నలుగురు విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కాగా.. పవన్ బాశెట్టి, గిరీశ్ సుబ్రమణ్యం లీసెస్టర్ యూనివర్సిటీలో ఏరోనాటిక్ ఇంజినీరింగ్ మాస్టర్స్ చేస్తుండగా.. నెల్లూరుకు చెందిన సుధాకర్ ఇప్పటికే ఆ కోర్సు పూర్తి చేసి అక్కడ పనిచేస్తున్నాడు. పోస్టుమార్టం నిర్వహించిన మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు కాన్సులేట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..